కేంద్రంలో బీజేపీ (BJP) ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే.. ప్రపంచంలో భారత్ అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తోందని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో పర్యటించారు. ఈ సందర్భంగా మీరట్ (Meerut)లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. దేశంలోని అవినీతిపరులపై తాను యుద్ధం చేస్తున్నానని తెలిపారు..
ప్రతిపక్ష ఇండియా కూటమి తనను బెదిరించాలని చూస్తోందని ఈ సందర్భంగా ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఇండియా కూటమి బెదిరింపులకు భయపడేదే లేదని పేర్కొన్నారు.. దేశంలోని అవినీతిపరులను జైలుకు పంపడం ఖాయమని వెల్లడించారు.. కాగా 2024 సార్వత్రిక ఎన్నికలు వికసిత్ భారత్ కోసం జరిగే కీలకమైన ఎన్నికలని ఇందు కోసం ఆలోచించి ఓటు వేయాలని వ్యాఖ్యానించారు..
అవినీతి అనేది అంతం అయితే.. దేశంలో పేదరికం కూడా అంతం అవుతోందని ప్రధాని తెలిపారు.. మరోవైపు కేజ్రీవాల్ (Kejriwal) అరెస్ట్‌ను నిరసిస్తూ ఇండియా కూటమి నేతలు నేడు ఢిల్లీ (Delhi)లో భారీ బహిరంగా సభ నిర్వహించారు. ప్రధానిపై కీలకమైన ఆరోపణలు చేశారు.. ఈ క్రమంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ దమ్ముంటే 200 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీకి సవాల్ విసిరారు..
అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ కేంద్ర ఎన్నికల సంఘంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొన్నట్లు ఆరోపణలు గుప్పించారు.. కాగా తాజాగా ఎన్డీఏ, ఇండియా కూటమి నేతల విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో దేశ రాజకీయం హిట్ ఎక్కుతోంది.. ముఖ్యంగా ఎన్నికల సమయంలో లిక్కర్ స్కామ్ పేరుతో అరెస్ట్ లు ఢిల్లీ రాజకీయాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి..