దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రముఖ రచయిత్రి(Famous Writter), వ్యాపారవేత్త సుధామూర్తి (Sudha murthi) బెంగళూరు నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ వయస్సులోనూ సుధామూర్తి బయటకు వచ్చి ఓటు వేయడంతో పాటు మీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవా
శుక్రవారం లోక్సభ ఎన్నికలకు రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే పోలింగ్ జరగనుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు సైతం ఓటింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ రచయిత్రి, ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సుధామూర్తి బెంగళూరు నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే ఓటు వేసిన ఆవిడ.. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఇంట్లో ఎవరూ కూర్చోకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మీ నాయకుడిని ఎన్నోకోవాలని సూచించారు.
గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే పట్టణ ప్రజలు ఓటింగ్లో తక్కువగా పాల్గొంటున్నారని తెలిసింది. యువతను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నా.. బయటకు వచ్చి అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సుధామూర్తి పిలుపునిచ్చారు.








