పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో నేతలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.. ఈ క్రమంలో నేడు బీజేపీ (BJP) కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ర్ట అధ్యక్షులు కిషన్ రెడ్డి.. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.. అవినీతి బంధుప్రీతిని కాంగ్రెస్ (Congress) పూర్తిగా వదిలి పెట్టలేదని విమర్శించారు.. కాంగ్రెస్ పాలనలో ప్రజల జీవితాలు ఏ విధంగా ఉన్నాయో అందరికి తెలుసన్నారు..
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు.. 2047 వికసిత భారత్ (Vikasita Bharath)పేరుతో ముందుకెళ్తోందన్న కిషన్ రెడ్డి.. దేశంలో 95 శాతం ఉగ్రవాదం తగ్గుముఖం పట్టిందన్నారు.. కర్ఫ్యూలేని భారతాన్ని నిర్మాణం చేయాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు.. మోడీ పాలనలో భారతదేశం ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిందని పేర్కొన్నారు..
దేశంలో నాణ్యమైన విద్య, అందరికీ ఆరోగ్యం, పేదలకు పక్కా ఇళ్లు గ్యారంటీగా అందివ్వాలనే ఆశయంతో కేంద్రం పనిచేస్తుందని తెలిపిన కిషన్ రెడ్డి (Kishan Reddy).. మరో ఐదేళ్ల వరకు ఇలాగే ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.. అదేవిధంగా పేపర్ లీకేజీ అరికట్టే విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చినట్లు వెల్లడించారు..
అదీగాక భారత్ ను సర్వీస్ సెక్టార్ హబ్ గా విస్తరిస్తామని అన్నారు.. పోస్టాఫీసులను మినీ బ్యాంక్ లుగా మార్చేస్తున్నట్లు పేర్కొన్న కిషన్ రెడ్డి.. పంటల భీమా మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని వెల్లడించారు.. భారతదేశాన్ని మిల్లెట్ హబ్ గా మర్చుతామని.. మత్స్యకారులను అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపారు.. అలాగే దేశ భవిష్యత్ కోసమే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు..