కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) మధ్య వార్ పిక్ స్టేజీకి వెళ్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు తగ్గకుండా విమర్శలు గుప్పించుకొంటున్నారు.. అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్ అంటూ చేసిన ట్వీట్ పై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (Balmuri Venkat) ఘాటుగా స్పందించారు.. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా మీ నాన్న, నువ్వు సమాజానికి ఒరగబెట్టింది ఏంటని ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నన్ని రోజులు అహంకారంతో ఉన్న మిమ్మల్ని ఇంట్లో కుర్చోబెట్టగానే తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా ?.. పదవులు ఉన్నప్పుడు ఒక్కసారి అయినా వాళ్లని కలిసిన పాపాన పోలేదు. ఇప్పుడు ఎగిరి ఎగిరి పడుతున్నావ్.. ఈ చీప్ పాలిటిక్స్ వదులుకుంటే మంచిదని సూచించారు.. అలాగే మొన్నటి మీ బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో విద్యార్థుల, యువత అంశం ఒక్కటి అయినా ఉందా ? అని వెంకట్ ప్రశ్నించారు.
మీ పదేళ్ళ ప్రభుత్వ పాలనలో అబద్ధాలు.. అవినీతి.. మోసం ఇవి తప్ప ఏమైనా కనిపించాయా? అని మండిపడిన వెంకట్.. ఇంటికో ఉద్యోగం, పేపర్ లీకేజీ వంటి అంశాలు మరచి మాట్లాడటం సరికాదని సూచించారు.. మేము నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతీ హామికి కట్టుబడి ఉన్నాం. ఇది ప్రజా ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు మంత్రులు యువతకు అందుబాటులో ఉన్న విషయాన్ని గమనించాలన్నారు..
ప్రగతి భవన్ లో కంచెలు వేసే రోజులు పోయాయని పేర్కొన్న వెంకట్.. కేటీఆర్ నోరు జాగ్రత్త అని హెచ్చరించారు.. నీ అహంకారమే నీకు శత్రువని తెలుసుకో.. తెలంగాణ ఉసురు పోసుకుంది నువ్వూ, నీ కుటుంబం.. అందుకే మట్టి కొట్టుకుపోయారని ఘాటుగా విమర్శించారు.. మీలా నమ్మించి గొంతు కోసే రకం కాదని స్పష్టం చేశారు. ఎండవేడికి ఆగం అవుతున్నావ్ అందుకే ఏం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు.. కాబట్టి AC ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో అని సెటైర్ వేశారు..