ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ (Liquor Scam)లో కవిత (Kavitha)ను అరెస్ట్ చేసిన సీబీఐ (CBI), ఈడీ (ED).. రెండవ రోజు విచారణ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో కవిత అరెస్టు విషయంలో సీబీఐ, ఈడీ నిబంధనలు పాటించలేదని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు (Mohit Rao) ఆరోపిస్తున్నారు.. త్వరలోనే ఆమె బయటకు రాబోతున్నారని తెలిపిన ఆయన దర్యాప్తు సంస్థలను ధైర్యంగా ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు..
అదేవిధంగా సీబీఐ, ఈడీ విచారణకు సంపూర్ణంగా సహకరిస్తున్న కవిత.. ఆరోగ్యం బాగానే ఉందన్నారు.. కోర్టు ఆదేశాలతో కస్టడీలో ఉన్న ఆమెకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.. ఇప్పటి వరకు కవితకు వ్యతిరేకంగా ఏ విధమైన ఆధారాలు లేవని పేర్కొన్న న్యాయవాది.. కేవలం ఆరోపణలపైనే అరెస్టు చేసినట్లుగా వెల్లడించారు.. 100 కోట్ల రూపాయలు చేతులు మారాయని తెలిపిన అధికారులు.. ప్రస్తుతం వరకు ఒక్కరూపాయి కూడా గుర్తించనట్లు తెలిపారు..
ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు కవిత పాల్పడలేదని వివరించిన న్యాయవాది మోహిత్ రావు.. అప్రూవర్లుగా మారిన వాళ్లు ఇచ్చిన వాంగ్మూలం అంతా కల్పితాలేనని పేర్కొన్నారు.. అలాగే జాగృతి సంస్థకు ప్రభుత్వాలుసైతం విరాళాలు ఇచ్చినట్లు తెలిపారు.. మరోవైపు మహబూబ్ నగర్ భూమి విషయంలో అగ్రిమెంట్ ప్రకారమే ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిపారు..
అభిషేక్ బోయిన్ పల్లి, గోరంట్ల బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిళ్ళైతో కవితకు ఎటువంటి వ్యాపార సంబంధాలు లేవని తెలిపిన న్యాయవాది.. ఇదంతా రాజకీయ కక్షగా పేర్కొన్నారు.. అలాగే బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు సంవత్సరం ముందు ఆమెను ఆహ్వానించగా తిరస్కరించడంతో అక్రమంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరికించారని ఆరోపించారు.. ఇదిలా ఉండగా కవితపై వచ్చిన ఆరోపణల గురించి ప్రశ్నించగా, నాకు తెలియదని సమాధానం చెప్పారు..
శరత్ చంద్రారెడ్డి, మీ మధ్య జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ పై మీ సమాధానం ఏంటన్న సీబీఐ ప్రశ్నకి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా చేయొచ్చు దీనిని పరిగణలోనికి ఎలా తీసుకుంటారని కవిత సమాధానం ఇచ్చారు.. కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాటింగ్ లు ఉన్నాయంటూ ప్రశ్నించిన సీబీఐతో అవన్నీ మానిప్లేటెడ్ అంటూ కవిత కొట్టి పారేశారు..