రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ నేతలను తెగ టెన్షన్ పెట్టిస్తున్న అంశం.. పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది.. ప్రస్తుతం నేతలంతా ఎవరి వ్యూహాల్లో వారున్నారు.. తమదే విజయం అనే ధీమాలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు ప్రదర్శిస్తున్నారు.. మరోవైపు మాటలతో ఒకరిని ఒకరు ఇరుకున పడేసుకొంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), బీఆర్ఎస్ (BRS)ని ఇరుకున పడేసేలా ఉన్న అంశాన్ని తెరమీదికి తెచ్చారు.. రాజ్యాంగాన్ని మార్చాలని గతంలో కేసీఆర్ అన్నారని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ (BJP) ప్రయత్నిస్తోందని ఆరోపించారు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు..
రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో కేసీఆర్ (KCR) ప్రకటించాలని డిమాండ్ చేసిన రేవంత్.. రాజ్యాంగాన్ని దెబ్బతీయాలని చూసే బీజేపీపై కేసీఆర్ పోరాటం ఏదని.. కేవలం మా ప్రభుత్వాన్ని కూల్చడంపైనే మీ దృష్టి ఉందని మండిపడ్డారు.. కేంద్రంలో పదేళ్ల బీజేపీ పాలనపై కనీసం ప్రశ్నించరా ? అని ధ్వజమెత్తారు.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి, ఈటల రాజేందర్ సంభాషణ ఉదాహరణగా పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana) పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 5 సీట్లు బీజేపీకి తాకట్టు పెట్టిందని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. మీ చీకటి ఒప్పందం నిజం కాకపోతే మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత కాలం దోపిడి చేసింది చాలదని ప్రభుత్వాన్ని కూల్చి మళ్ళీ దోపిడి చేయాలని చూస్తుందని బీఆర్ఎస్ అధిష్టానంపై మండిపడ్డారు..