ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రధానం అయ్యాయి.. ఒకరకంగా జీవన్మరణ సమస్యగా మారాయి.. ముఖ్యంగా తెలంగాణలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) మధ్య బీఆర్ఎస్ (BRS) ప్రయాణం సౌకర్యవంతంగా సాగడం లేదని తెలుస్తోంది. ఒక ప్రతిపక్షంగా ఆ పార్టీ సమర్థవంతంగా పని చేయడం కంటే.. పోయిన అధికారాన్ని సాధించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పుకొంటున్నారు..
తన గోచి ఊడిపోతుంటే పక్కనోడి గోచీ పాడైపోతుందని వెనుకటికి ఒకతను బాధపడినట్లుగా కేసీఆర్ (KCR) వ్యవహారం ఉందని చర్చించుకొంటున్నారు.. తన పార్టీకి ప్రస్తుతం అతీగతీ లేదు.. కానీ ఇప్పుడు ఏపీ రాజకీయాలు అవసరమా ?.. అనే టాక్ తీసుకొచ్చారు గులాబీ బాస్.. అసలు బీఆర్ఎస్ మీద ప్రజల్లో వ్యతిరేకత ఉండి కాబట్టే ఓటమి పాలు చేశారని రాష్ట్రం అంతా కోడైకూస్తుంటే.. లోపాలు సరి చేసుకొవాలి..
కానీ తమ తప్పులు బంగారుపెట్టేలో పదిలంగా దాచి సాకులు వెతికితే జనం నవ్వుకుంటారు తప్ప అయ్యోపాపం అని ఓట్లు వేయారు. ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలంటే చీమల్లా చూశారనే ప్రచారం గల్లీ గల్లీలో పాకింది. ఇది తెలుసుకోక ఇప్పుడు పాకులాడితే నమ్మేవారు ఎవరనే టాక్ వినిపిస్తోంది. ఇక తన అధికారం ఊడిపోయే వరకు తనకు తెలియలేదుగానీ, ఏపీ ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందని జోస్యం చెప్పడం నవ్వులపాలు చేసుకోవడం తప్పితే.. రాష్ట్ర ప్రజల మన్ననలు పొందేలా లేదంటున్నారు..
మరోవైపు ఏపీలో వైసీపీ దారుణంగా ఓడిపోవడం ఖాయమని అక్కడి జనాల్లో టాక్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.. మరి ఫామ్ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి అంత గొప్ప సమాచారం ఇచ్చిందెవరో అని జుట్టుపీక్కుంటున్నారు.. ఈయన ఒక సిద్ధాంతి.. ఈయనకి సమాచారం ఇచ్చినాయన ఒక వేదాంతి అని అనుకొంటున్నారు. కేసీఆర్ మాటలు ఆయనకి ఈటెలుగా గుచ్చుతాయని భావించి ఉండరని కొందరు పంచ్ లు వేస్తున్నారు..