Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
టీమిండియా (Team India) మాజీ ఓపెనర్, బీజేపీ (BJP) ఎంపీ గౌతం గంభీర్ (Gautam Gambhir) సంచలన నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (JP Nadda)కు ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.. ఈ క్రమంలో క్రికెట్లో కమిట్మెంట్ ఇచ్చిన టోర్నమెంట్లపై ఫోకస్ చేయనున్నట్లు ప్రకటించారు.
అదే విధంగా ప్రజలకు ఇన్నాళ్లు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై హింద్ అని గౌతం గంభీర్ ట్వీట్ (X) చేశారు. కాగా గంభీర్ తూర్పు ఢిల్లీ (Delhi) నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అతడు తీసుకొన్న నిర్ణయం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.
కాగా ఢిల్లీకి చెందిన గౌతం గంభీర్ 2003లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకొన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో మొత్తంగా 147 వన్డేలు, 58 టెస్టులు, 37 టీ20లు ఆడిన గంభీర్ ఆయా ఫార్మాట్లలో వరుసగా 5238, 4154, 932 పరుగులు సాధించారు. భారత్ తరఫున 2016లో ఆఖరి మ్యాచ్ ఆడిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 2019లో రాజకీయాల్లో ప్రవేశించారు.
బీజేపీలో నాటి కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో చేరారు. 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో తుర్పు ఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి 695109 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు.. అప్పటి నుంచి గంభీర్, బీజేపీ తరఫున బలంగా గొంతు వినిపిస్తున్నారు. అదీగాక క్రికెట్ కామెంటేటర్‌గా, ఐపీఎల్ ఫ్రాంఛైజీ మెంటార్‌గా సేవలు అందిస్తున్నారు.