Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
సంక్రాంతి (Sankranti) పండగ సందర్భంగా రైళ్లు.. బస్సులు రద్దీతో నిండిపోయాయి.. కానీ హైదరాబాద్ (Hyderabad) మెట్రో (Metro) మాత్రం ఖాళీగా మారింది. సెలవులు లేకుంటే కాలు పెట్టడానికి కూడా సందు ఉండని మెట్రో రైలు.. ప్రస్తుతం ప్రయాణికులు లేకుండా వెలవెలబోతోంది.. మరోవైపు పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెలకు పయనయ్యారు. దీంతో నగరం అంతా నిర్మానుష్యంగా మారింది.
ఈ నేపథ్యంలో నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు సువర్ణాకాశం కల్పించారు. నేటి నుంచి మూడు రోజుల అపరిమిత ఆఫర్ (Three Days Unlimited Offer)ను అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైతే మెట్రో కార్డ్ (Metro Card) కలిగి ఉన్నారో వారు రూ.59 రీఛార్జ్ చేసుకొని.. రైలులో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ అవకాశం జనవరి 13, 14, 15 తేదీల్లో మాత్రమే వర్తిస్తుందని వారు వెల్లడించారు..
అయితే మెట్రో కార్డ్ రీఛార్జ్ ఒక్క సారి చేసుకుంటే ఆ రోజంతా మెట్రో రైలులో అపరిమితంగా ప్రయాణించే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు.. ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రకటించారు.. ఇకపోతే ప్రస్తుతం ఉద్యోగులంతా పండగ సెలవులు తీసుకోవడంతో మెట్రో రైలు ఖాళీగా ప్రయాణిస్తోంది. అదే ఆఫీసులు ఉన్న సమయంలో విపరీతమైన రద్దీతో కనిపించే మెట్రోలో ఊపిరి ఆడటం కూడా కష్టం అయ్యేలా జనం ఉండటం తెలిసిందే.. ఇక నగరాన్ని మెట్రో రైలులో చూడాలనుకొనే వారికి ఇది మంచి అవకాశంగా పేర్కొంటున్నారు..






