Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
తెలంగాణ (Telangana)లో ఏర్పడ్డ కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి రావడానికి బీఆర్ఎస్ పై వాళ్ళు కొన్ని దుష్ప్రచారాలు చేశారు.. ప్రజలు నమ్మారు వాళ్ళకి అధికారం ఇచ్చారని పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్టు.. పొగిడినట్టు కాకుండా.. విమర్శలు చేశారు..
అధికార పార్టీ వాళ్ళు మన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తారని ఆరోపించిన హరీష్ రావు (Harish Rao)..మనం కుంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ పాలన కూడా రాష్ట్రంలో ఎలా ఉంటుందో చూడాలని ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు.. వాళ్ళు గత ప్రభుత్వం కంటే బాగా పాలన చేయాలని కోరుకుందామని తెలిపారు.
బీఆర్ఎస్ (BRS) అధికారపక్షంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు ప్రజల పక్షమే ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఓటర్ల తీర్పు శిరసా వహిస్తున్నామని తెలిపిన హరీష్ రావు.. ఓటమిపై సమీక్ష జరుపుదాం.. తప్పు ఒప్పులు సరి చేసుకుని ముందుకు వెళ్తాం అని వెల్లడించారు. రాష్ట్రం అంతా తక్కువగా ఓట్లు పడినా.. సంగారెడ్డి (Sangareddy)లో మాత్రం ఈ సారి గులాబీ జెండా ఎగిరిందని హరీష్ రావు తెలిపారు.
చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బ తిన్నా.. ప్రతి ఒక్క కార్యకర్త, అభ్యర్థిగా కష్టపడి పని చేసి బీఆర్ఎస్ ని ఇక్కడ గెలిపించారని హరీష్ రావు అభినందించారు. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని మాట ఇచ్చారు. త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చూపించాలని హరీష్ రావు కార్యకర్తలకి సూచించారు.. ఏడుగురు ఎమ్మెల్యేలు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నారు.. వారితో కలిసి అందరం పని చేద్దామని హరీష్ రావు తెలిపారు.






