Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
ఏపీలోని బాపట్ల జిల్లా (Bapatla district) బర్తిపూడిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. అర్ధరాత్రి వేళ విగ్రహం తల పగులగొట్టి పరారయ్యారు. ఈ ఘటనను తెలుగుదేశం (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu), పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఖండించారు.
అర్ధరాత్రి వెళ్లి ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు. మహనీయుల పట్ల అగౌరవంగా వ్యవహరించడం వైసీపీ అహంకారానికి నిదర్శనమన్నారు. బాధ్యులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు ఓటమి భయంతో వైసీపీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతోందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు లోకేశ్ ఆరోపించారు. తెలుగు ప్రజల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ స్థానాన్ని వైసీపీ ఆయన విగ్రహాల కూల్చివేతతో చెరిపేయలేదని స్పష్టం చేశారు. మూడు నెలల్లో ఎన్టీఆర్ విగ్రహం కూల్చిన వారితోనే కూల్చిన చోటే మళ్లీ పెట్టిస్తామని అన్నారు.
అదేవిధంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. జై తెలుగుదేశం.. జోహార్ ఎన్టీఆర్.. అంటూ నినదించారు. ’వాళ్లు ధ్వంసం చేసింది విగ్రహాన్ని కాదు.. తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీకను అని మండిపడ్డారు.












