Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
భారత ప్రధాని మోడీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Cm revanth reddy) సంచలన కామెంట్స్ చేశారు.దేశంలో బీజేపీ(BJP) అధికారంలోకి ఎలా వస్తుందనే కారణాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఓ ఇంగ్లిష్ చానెల్ ప్రతినిధితో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ బీజేపీ అధికారంలోకి రావడానికి ఈవీఎంలే కారణమన్నారు.
ఈవీఎంలలో మోడీ(PM MODI) ఏ నెంబర్ నొక్కితే అదే వస్తుందన్నారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని కోరితే బీజేపీ, మోడీ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. నరేంద్రమోడీ అధికారంలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్‌కు అధికారం రాదని పార్లమెంట్ సెంట్రల్ హాలులో బీజేపీ నేతలే చెబుతున్నారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
ఈవీఎం మోడీ చోటా భాయ్ కాదు కాదా.. ఎందుకు వదలడం లేదని ప్రశ్నించారు. ప్రపంచం మొత్తం పేపర్ బ్యాలెట్‌తోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, కేవలం మనదేశంలోనే ఈవీఎంలు వినియోగిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రజలకు ఈవీఎంపై నమ్మకం పోయిందని తెలిపారు. కానీ,బీజేపీకి మాత్రం ఈవీఎంలపై పూర్తి నమ్మకం ఉందని ఎద్దేశా చేశారు. బీజేపీ నమ్మకంతో తమకు పనిలేదని.. ప్రజల నమ్మకమే తనకు ముఖ్యమని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిగితే నీళ్లు ఏవో.. పాలు ఏవో తెలిసిపోతుందని వివరించారు.