Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
అనంతపురం జిల్లా(Ananthapuram District) గుత్తిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్(CM Jagan) ను లక్ష్యంగా చేసుకుని గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరిన ఘటన కలకలం రేపింది. ఈ నేపథ్యంలో చెప్పువిసరడంపై గతంలో అప్పటి డీజీపీ గౌతం సవాంగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా(Social Media) లో వైరల్(Viral) అవుతోంది.
జగన్ ప్రభుత్వం(Jagan Government) రాజధాని అమరావతి(Rajadhani Amaravathi) పనులను ఎక్కడికక్కడ నిలిపివేసి, కక్ష సాధింపు చర్యలకు దిగినప్పుడు రైతులకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాజధాని గ్రామాల్లో పర్యటించారు. వైకాపా ప్రేరేపిత దుండగులు కొందరు ఆయన వాహనంపై కర్రలు, చెప్పులు విసిరారు.
జడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ సీఎంపై దాడిని తీవ్రంగా పరిగణించి, దుండగులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘అది దాడి కాదు.. భావ ప్రకటన స్వేచ్ఛ..’ అని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మాటలు తెగ వైరల్ అయ్యాయి.
రాజ్యాంగంలో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉందని, చెప్పులు విసరడం కూడా ఒక విధమైన భావప్రకటన స్వేచ్ఛే అంటూ డీజీపీ చెప్పిన మాటలు ఇప్పుడు జగన్‌పై దాడితో మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. సీఎం జగన్‌కూ డీజీపీ వ్యాఖ్యలు వర్థిస్తాయంటూ టీడీపీ శ్రేణులు కామెంట్స్ పెడుతున్నారు.