Find the latest Telugu news and political news in Andhra and Telangana in Telugu, తెలుగు రాజకీయ వార్తలు, పాలిటిక్స్ న్యూస్,
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది నేతలు దూకుడు పెంచుతున్నారు.. గెలుపే లక్ష్యంగా ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్నారు.. మరోవైపు కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల విజయాన్ని.. పార్లమెంట్ ఎన్నికల్లో రిపీట్ చేయడానికి ఉవ్విళ్లూరుతుంది.. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్ (Hyderabad), జూబ్లీహిల్స్, మల్కాజిగిరి (Malkajgiri) పార్లమెంట్ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు..
ఇందులో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేశారు.. ఈ మేరకు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, నియోజకవర్గ ఇంఛార్జీలు, డీసీసీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ (CM Revanth Reddy) రెడ్డి లోక్సభ నియోజకవర్గాలతో సమీక్ష, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంతో మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.
మరోవైపు 17 పార్లమెంట్ నియోజకవర్గాల నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా సమీక్ష నిర్వహిస్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. కాగా టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ ఈ సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు.. అదేవిధంగా మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని (Sunitha Mahender Reddy) నాయకులకు పరిచయం చేసే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ నేతలు అనుకొంటున్నారు..