– సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా
– ఓఎస్డీ ద్వారా గవర్నర్ కు అందజేత
– ఆ వెంటనే ఫాంహౌస్ కు పయనం
– రాజీనామాను ఆమోదించిన గవర్నర్
సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై కి పంపి అక్కడి నుంచి ఫాంహౌస్ కు వెళ్లారు.

అయితే.. ఇప్పుడు కనీసం మొహం చూపించకుండా ఎలాంటి ఆర్భాటం లేకుండా.. కనీసం అక్కడున్న పోలీసులకు కూడా సమాచారం ఇవ్వకుండా సొంత వాహనంలో వెళ్లి ఓఎస్డీకి సమర్పించారు. ఆ తరువాత కూడా ఎవరికీ తెలియకుండా తన ఫాంహౌస్ కు వెళ్లారు. కేసీఆర్ కామారెడ్డిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు.
మొదటి నుంచి ఈ నియోజకవర్గంలో విజయం మూడు పార్టీలతో దోబూచులాడింది. మొదటి బీజేపీ అభ్యర్థి వెంటక రమణ లీడింగ్ లోకి వచ్చారు. ఆ కొద్ది సేపటికే సీఎం కేసీఆర్ పుంజుకున్నారు. ఇంతలో అనూహ్యంగా రేవంత్ రెడ్డి ఆధిక్యంలోకి వచ్చారు. ఇలా పలు రౌండ్లలో ఆధిక్యం చేతులు మారుతూ వచ్చింది. చివరికి బీజేపీ అభ్యర్థి చేతిలో కేసీఆర్, రేవంత్ ఓడిపోయారు.

ఇక్కడ బీజేపీ ఘన విజయం సాధించింది. కేసీఆర్ తో పాటు, రేవంత్ రెడ్డిని ఓడించి వెంకట రమణారెడ్డి వార్తల్లో నిలిచారు. ముందు నుంచి ఊహించినట్టే ఈ సీటులో హోరాహోరీ పోరు జరిగింది. క్షణక్షణానికి, రౌండ్ రౌండ్ కి ఆధిక్యం మూడు పార్టీల మధ్య మారుతూ వచ్చింది. చివరకు కామారెడ్డి ఓటర్ స్థానిక అభ్యర్థికే పట్టం కట్టారు.


