తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్ అల్లకల్లోలంగా మారడానికి కేసీఆర్ కారణం అయ్యారనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక నేతలు బీఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరించడం కనిపిస్తోంది. అందులో లోక్ సభ ఎన్నికల్లో గులాబీ ఉనికి మాయం చేయాలనే సంకల్పంతో విజయం కోసం తపిస్తున్న నేతలు తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, ధరణి పోర్టల్ లో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ విషయంలో కేసీఆర్, కేటీఆర్ త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని రాజగోపాల్ రెడ్డి జోస్యం చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 14 ఎంపీ సీట్లు గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు.. మరోవైపు భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి.. కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ ఇక్కడ మోడీని తిట్టి ఢిల్లీలో కలుస్తాడని ఆరోపించారు. ఆయనకు చిత్తశుద్ధి లేదన్నారు. లౌక్యం ఉందో లేదో కూడా నాకు తెలియదని పేర్కొన్నారు. విభజన హామీల ప్రకారం రావలసిన నిధులు తీసుకొచ్చి మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకోవచ్చని తెలిపిన కిరణ్ కుమార్.. ఈ అంశాన్ని పక్కనపడేసి.. కాలేశ్వరం ప్రాజెక్టు కమీషన్ ల మీద శ్రద్ధ చూపించారని ధ్వజమెత్తారు..








