అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) నేతల నిజస్వరూపాలను బయట పెడుతున్నాయని జనం ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. టికెట్ దక్కకుంటే పక్క పార్టీలో ఖర్చీఫ్ వేసే నేతలని ఓ కంట గమనిస్తున్నారని అంటున్నారు. కులాల పేరుతో చేస్తున్న రాజకీయాలను విద్యావంతులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే..
మరోవైపు నేతలు అధికారపీఠం అధిరోహించడానికి ఎంతకైనా తెగిస్తున్నారని కడుపులు కాలుతున్న వారు దుమ్మెత్తి పోస్తున్నారని అనుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలు.. డబ్బు, కులం పేరుతో మాత్రమే అని మేధావులు బల్లగుద్ది చెబుతున్నారు.. ఈ క్రమంలో కాంగ్రెస్ లో కులాల కుమ్ములాట మొదలైనట్టు తెలుస్తుంది. మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) కాంగ్రెస్ (Congress) పార్టీలో కమ్మ కులానికి అధికంగా సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేయడం కీలకంగా మారింది.
ఢిల్లీ (Delhi)లోని ఏఐసీసీ (AICC) పెద్దలతో సమావేశం అనంతరం రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు పలు చర్చలకు దారితీసాయి.. కమ్మ కులానికి సామాజిక న్యాయం జరగటం లేదని.. బయట నుంచి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డ రేణుకా చౌదరి.. డబ్బున్న వాళ్లకే కాదు.. దమ్మున్న వారికి టికెట్లు ఇవ్వాలని కోరారు..
అలాగే కమ్మ కులం వాళ్ల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని అధిష్టానాన్ని కొరినట్టు రేణుకా చౌదరి తెలిపారు.. పిల్లికి బిచ్చం వేసినట్లు సీట్లు ఇస్తామంటే కుదరదని స్పష్టం చేసినట్టు రేణుకా చౌదరి వెల్లడించారు.. అలా చేస్తే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హైకమాండ్ కు చెప్పినట్టు రేణుకా చౌదరి తెలిపారు.. కమ్మ కులస్తులను తక్కువ అంచనా వేయొద్దంటూ ఏకంగా వార్నింగ్ ఇచ్చేశారు రేణుకాచౌదరి. కమ్మకి ఎక్కువ సీట్లు ఇస్తే.. ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకే వస్తాయని తెలిపారు..