Telugu News » DGP Anjanikumar: పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ నెంబర్ వన్: డీజీపీ అంజనీకుమార్

DGP Anjanikumar: పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ నెంబర్ వన్: డీజీపీ అంజనీకుమార్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ అధికారులు నివాళులర్పించారు.

by Mano
DGP Anjanikumar: Telangana Number One in Police Services: DGP Anjanikumar

పోలీస్ సర్వీసింగ్‌లో తెలంగాణ నెంబర్ వన్‌ స్థానంలో ఉందని డీజీపీ అంజనీ కుమార్ (DGP Anjanikumar) అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా గోశామహల్ స్టేడియంలో ఫ్లాగ్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీతో పాటు హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య Hyderabad CP Sandeep Sandilya),  ఇతర పోలీస్ అధికారులు హాజరయ్యారు.

DGP Anjanikumar: Telangana Number One in Police Services: DGP Anjanikumar

ఈ సందర్భంగా పోలీస్ అమరవీరులకు డీజీపీ, పోలీస్ అధికారులు నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ కంటింజెంట్స్ పరేడ్ నిర్వహించారు. అనంతరం డీజీపీ అంజనీకుమార్ మాట్లాడుతూ.. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 189 పోలీసులు అమరులయ్యారన్నారు. కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ వరకు విధి నిర్వహణలో తమ ప్రాణాలు వదిలారని తెలిపారు.

పోలీస్ సర్వీసెస్‌లో తెలంగాణ ముందుందని చెప్పారు. భరోసా సెంటర్ దేశంలో రోల్‌ మోడల్‌గా ఉందన్నారు. ప్రజలు కుటుంబాలతో పండుగలు చేసుకుంటే పోలీసులు మాత్రం రోడ్లపై డ్యూటీలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. అత్యధిక సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

తెలంగాణలో క్రైం రేట్ తగ్గుతూ వస్తోందన్నారు. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. డే అండ్ నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. కరోనా టైంలో పోలీసులు 24 గంటలు డ్యూటీలు చేశారని.. కరోనా టైంలో పోలీస్ ఆఫీసర్స్ ప్రాణాలు వదిలారని డీజీపీ అంజనీకుమార్ గుర్తుచేశారు.

You may also like

Leave a Comment