Telugu News » Treasure Box :  విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టెలో నిధులున్నాయా?

Treasure Box :  విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన పెట్టెలో నిధులున్నాయా?

ప్రస్తుతం బీచ్‌లో ఉన్న ఈ పెట్టెను చూసేందుకు సందర్శకులు ఆ భారీగా వస్తున్నారు. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది.

by Prasanna
Tresure box

విశాఖపట్నం (Visakhapatnam) లో వైఎంసీఏ బీచ్‌ తీరానికి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకుని వచ్చింది. శుక్రవారం రాత్రి మత్స్యకారులు (Fishermen) ఈ పెట్టెను గమనించారు. పోలీసులకు స్థానికులు సమాచారం అందించగా…అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ చెక్క పెట్టె (Wooden Box) ప్రొక్లెనర్‌ సహాయంతో ఒడ్డుకు చేర్చారు. ఈ విషయంపై ఆర్కియాలజీ విభాగానికి పోలీసులు సమాచారం ఇచ్చారు.

Tresure box

ప్రస్తుతం బీచ్‌లో ఉన్న ఈ పెట్టెను చూసేందుకు సందర్శకులు ఆ భారీగా వస్తున్నారు. ఇప్పుడు ఆ పెట్టెలో ఏముందనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ఇందులో నిధులుంటాయని దీనిని చూడడానికి వచ్చిన వారంతా చర్చించుకుంటున్నారు. విశాఖ తీరానికి గతంలో కూడా కొన్ని వస్తువులు కొట్టుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి.

 మరోవైపు గతంలోనే విశాఖ తీరంలో బ్రిటిష్ కాలం నాటి బంకర్లు బయటపడ్డాయి. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో శత్రువులపై దాడి కోసం నిర్మించిన ఈ బంకర్‌లు చాలా వరకు విశాఖ తీరంలో ఉన్నాయి. అయితే, కాలక్రమంలో సముద్రపు అలల తాకిడికి కొన్ని ఇసుకలో కూరుకుపోయాయి. ఇప్పటికీ జాలరి పేట వద్ద బంకర్ శిథిల స్థితిలో కనిపిస్తోంది.

స్పాట్ కు చేరుకున్న పురావస్తుశాఖ అధికారులు ఈ పెట్టెను పరిశీలిస్తున్నారు. అది పురాతన వస్తువని అంతా అనుకుంటుండగా…అదొక చెక్క దిమ్మె అని పురావస్తుశాఖ అధికారులు భావిస్తున్నారు. షిప్పుల్లో ఇంతటి భారీ చెక్కదిమ్మెలు ఉంటాయని, అటుపోట్లు సమయంలో షిప్ ని బ్యాలన్స్ చేసేందుకు ఈ దిమ్మెలను వాడుతుంటారని చెప్తున్నారు. విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన చెక్కదిమ్మె కూడా అలాంటిదేనని అనుకుంటున్నామని తెలిపారు. అయితే ఇంకా దీనిపై పూర్తిగా పరిశీలన చేయాల్సి ఉందని తెలిపారు.

 

You may also like

Leave a Comment