Telugu News » TTD: గోవింద కోటి రాస్తే…ఆ కుటుంబానికి వీఐపీ దర్శనం!

TTD: గోవింద కోటి రాస్తే…ఆ కుటుంబానికి వీఐపీ దర్శనం!

ఇకపై ఎలాంటి దళారుల బెంగా లేకుండా మనమే వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. దీని కోసం మనం చేయాల్సిందల్లా రామకోటి మాదిరిగా గోవింద కోటిని రాయాలని టీడీడీ చెప్తోంది.

by Prasanna
Tirumala temple

TTD: గోవింద కోటి రాస్తే…ఆ కుటుంబానికి వీఐపీ దర్శనం!

మనలో చాలామందికి రామకోటీ రాసే అలవాటు ఉంటుంది. భక్తిభావంతోపాటు మానసిక ప్రశాంతత కోసం రామనామమో గోవింద  నామమో స్మరిస్తూనే ఉంటాం. తమకి నచ్చిన దేవుడి పేరును కోటిసార్లు రాయడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తుంటాం. ఇలా రామకోటి శివకోటి రాయడాన్న ధర్మప్రచారానికి ఉపయోగించుకోవాలనుకుంటోంది తిరుమల తిరుపతి దేవస్థానం(TTD). రామకోటి తరహాలో ‘గోవింద కోటి’ (Govinda Koti) కార్యక్రమానికి శ్రీకారం చేపట్టామని టీటీడీ చైర్మన్‌ కరుణాకరరెడ్డి (Karunakara Reddy)తెలిపారు.

Tirumala temple

వీఐపీ దర్శనం ఇలా…

తిరుమల శ్రీవారని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడలనుకునేవారే ఎక్కువ. సాధారణ కోసం రోజుల తరబడి క్యూలైన్లో బారులు తీరుతారు…వీఐపీ దర్శనంకోసం అయితే ఏకంగా పైరవీలూ… ఎమ్మల్యే లెటర్లు… అబ్బో చాలా హడావిడే చేసేస్తారు. అయితే ఇకపై ఎలాంటి దళారుల బెంగా లేకుండా మనమే వీఐపీ దర్శనం చేసుకోవచ్చు. దీని కోసం మనం చేయాల్సిందల్లా రామకోటి మాదిరిగా గోవింద కోటిని రాయాలని టీడీడీ చెప్తోంది.

25 ఏళ్లలోపు వాళ్లు గోవిందా కోటిని (10,01,116 సార్లు) రాస్తే.. వారి కుటుంబానికి వీఐపీ దర్శనం ఇస్తామని టీటీడీ ఛైర్మన్ వెల్లడించారు. కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా భగవద్గీత పుస్తకాలను ముద్రించి పంపిణీ చేసే ఆలోచనలో ఉన్నారు. ముంబాయి బంద్రాలో వేంకటేశ్వరస్వామి ఆలయం, సమాచారకేంద్రం నిర్మాణాలు చేపట్టనున్నారు. తిరుపతిలో అతి పురాతనమైన 2, 3 సత్రాల స్థానంలో రూ.600 కోట్లతో రెండు నూతన వసతి భవనాలను నిర్మిస్తామన్నారు. ఒకదానికి అచ్యుతం, మరోదానికి శ్రీపథం అనే పేర్లు పెడతామన్నారు.

You may also like

Leave a Comment