ఇటీవల తిరుమల నడకదారి చిరుతకు అడ్డాగా మారిన సంగతి తెలిసిందే..వెంకన్న దేవుడి కోసం వస్తున్న భక్తులను తుదకు ఆ దేవుడి దగ్గరకే పంపేస్తున్నాయి. రక్తం మరిగిన చిరుత పులులు నిస్సహాయులైన చిన్నారులే లక్ష్యంగా మాటు వేస్తున్నాయి.ఆ క్రమంలోనే 6 యేళ్ల చిన్నారిని చిరుత పొట్టనపెట్టుకుంది.
కాగా అప్రమత్తమైన అధికారులు గురువారం చిరుతను పట్టిబంధించారు. కొత్తగా టీటీడి(TTD) చేపట్టిన ఛైర్మన్(Chairman) భూమన కరుణాకర రెడ్డి(Bhumana Karunakara Reddy), ఈవో ధర్మారెడ్డి చిరుత చిక్కిన ప్రదేశానికి వెళ్లారు.బోనులో చిక్కిన మగచిరుతకు ఐదేళ్ల వయసు ఉంటుందని తెలిపారు.
మరోవైపు అలిపిరి కాలినడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీపై సోషల్ మీడియాలో వస్తున్నట్రోల్స్ ను భూమన ఖండించారు.అటవీశాఖా అధికారులు సూచించిన మేరకే భక్తుల ఆత్మ రక్షణ నిమిత్తం కర్రల పంపిణీ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
కర్రలిచ్చి తితిదే బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్ చేయడం సమంజసం కాదన్నారు. భక్తుల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని మరిన్ని చిరుతలను బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
ఈవో ధర్మారెడ్డి(Dharma Reddy)మాట్లాడుతూ ఎస్వీ జూ పార్కుల నుంచి చిరుతలు తెచ్చి వదులుతున్నామంటూ ప్రచారం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఈ తప్పుడు ప్రచారాలను ఖండిస్తున్నాం. చిరుత సంచారంపై నిఘా కోసం కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎలుగుబంట్ల సంచారంపై డ్రోన్(drone cameras)కెమెరాలు ఏర్పాటు చేసి నిఘాపెట్టాం.” అని చెప్పారు.