Telugu News » TTD: టీటీడీ సంచలన ప్రకటన.. ‘గోవింద కోటి’ రాసిన వారికి బంపరాఫర్..!

TTD: టీటీడీ సంచలన ప్రకటన.. ‘గోవింద కోటి’ రాసిన వారికి బంపరాఫర్..!

టీటీడీ ఈవో(TTD EO) ధర్మారెడ్డి(Dharmareddy) సంచలన ప్రకటన చేశారు. 25ఏళ్ల లోపు వారు 'గోవింద కోటి' 10లక్షల 116సార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు.

by Mano
TTD: TTD sensational announcement.. Bumperafar to those who wrote 'Govinda Koti'..!

టీటీడీ ఈవో(TTD EO) ధర్మారెడ్డి(Dharmareddy) సంచలన ప్రకటన చేశారు. 25ఏళ్ల లోపు వారు ‘గోవింద కోటి’ 10లక్షల 116సార్లు రాసిన వారికి స్వామి వారి బ్రేక్ దర్శనం కల్పిస్తామని వెల్లడించారు. టీటీడీ పరిపాలన భవనం పెరేడ్ గ్రౌండ్‌లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీటీడీ ఈవో జాతీయ జెండా ఆవిష్కరించగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

TTD: TTD sensational announcement.. Bumperafar to those who wrote 'Govinda Koti'..!

ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ.. తిరుమలలో ఫిబ్రవరి 3 నుంచి వేంకటేశ్వర ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు. నడక మార్గంలో చిరుత పులుల దాడులకు అడ్డుకట్ట వేయడానికి రూ.5కోట్లు అటవీశాఖకు అందజేశామని చెప్పారు. టీటీడీ తరఫున వైకుంఠ ఏకాదశికి 10రోజుల పాటు 6 లక్షల 50వేల మంది భక్తులకు దర్శనం కల్పించామని తెలిపారు. ఫిబ్రవరి 16న రథ సప్తమి వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు.

అయోధ్యలో బాల రాముడు విగ్రహ ప్రతిష్ఠాపన రోజు లక్ష లడ్డూలు స్వామి వారికి అందించామని టీటీడీ వెల్లడించారు. స్వామి వారి అనుగ్రహంతో డిసెంబర్ 6న తిరుమలలో కుండ పోతవర్షం కురిసిందని, తిరుమలలో రిజర్వాయర్లు అన్నీ నిండాయని తెలిపారు. 1100 కోట్లు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నగదు వచ్చిందని, 700 ఆలయాలు పూర్తి అయ్యాయని మిగిలినవి మార్చిలోపు పూర్తి చేస్తామని తెలిపారు.

చరిత్రలో శ్రీకృష్ణ దేవరాయలు సమయంలో గుళ్లు, గోపురాలు నిర్మిస్తే నేడు సీఎం జగన్ ప్రభుత్వంలో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 3316 ఆలయాలు నిర్మాణం జరుగుతోందన్నారు. తిరుపతిలో అచ్యుతం, శ్రీ పథం గెస్ట్ హౌస్‌లు నిర్మాణంతో 25 వేల మందికి వసతి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. సీఎం జగన్ ప్రారంభించిన శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్ ద్వారా 26 నెలల్లో 2350 గుండె ఆపరేషన్స్ విజయవంతంగా నిర్వహించామన్నారు.

250 కోట్లతో చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతోంది. 80 శాతం పూర్తి అయ్యిందన్నారు. అదేవిధంగా ఎస్వీ వేదిక్ యూనివర్సిటీలో అతీంద్రియ విజ్ఞానం అనే నూతన కోర్సు ప్రారంభించామన్నారు. రూ.60 కోట్లతో అత్యాధునిక గోశాల నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.  టీటీడీ ఉద్యోగులకు మొదటి విడతలో 3518 మందికి , రెండో విడతలో 1700 మందికి ఇళ్లు స్థలాలు మంజూరు చేశామని, మరో 450ఎకరాల్లో 5వేల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి నెలాఖరుకు ఇళ్లస్థలాలు అందజేస్తామని చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment