Telugu News » RS Praveen Kumar : మాయవతి ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోండి.. ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌..!

RS Praveen Kumar : మాయవతి ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోండి.. ఆర్ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌..!

బీఎస్పీ పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతుందని మాయవతి ప్రకటించారు. ప్రత్యేకించి యూపీలో ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా అశాంతికి గురవుతున్నాయని అన్నారు.

by Venu
dalit-bandhu-brs-mlas-dalari-bandhu-rs-praveen-kumar-fire

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది.. పార్టీలు ముందు చూపుతో వ్యవహరించడం కనిపిస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR), ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ (RS Praveen Kumar)తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే.. ఇదే సమయంలో రాబోయే లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ (BSP) ఒంటరిగానే పోటీ చేస్తుందని మాయవతి (Mayawati) ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు..

Breaking: RS Praveen Kumar arrested..!అయితే ఈ ట్వీట్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారి చర్చలు జరుపుకొనే వరకు వెళ్ళింది. దీంతో బీఎస్పీ పొత్తుల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ప్రవీణ్ కుమార్ స్పందించారు. పార్టీ అధినేత్రి మాయవతి చేసిన ట్వీట్ సారాంశాన్ని అర్థం చేసుకోకుండా, తప్పుడు ఊహాగానాలు చేయటం సరికాదని సూచించారు. గతంలో చాలా సార్లు తాము ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఎన్డీఏ, ఇండియా కూటముల్లో ఉండబోమని తమ నాయకురాలు స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు..

యూపీలో ఒంటరిగా పోటీ చేస్తామని మాయవతి చెప్పారని, అంతే తప్ప ఏ కూటమిలో లేని పార్టీలతో కలసి పనిచేయడం గురించి ఆమె ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలో మధ్యప్రదేశ్, పంజాబ్‌లో ఏ జాతీయ కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో జరిగినట్టుగానే, తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కోసం ఇటీవల జరిగిన చర్చలకు తమ పార్టీ నాయకత్వం అనుమతి ఉందన్నారు. సీట్ల పంపకంపై స్పష్టత వచ్చే దాకా చర్చలు కొనసాగుతాయని ఆర్ఎస్. ప్రవీణ్‌ స్పష్టం చేశారు.

మరోవైపు నిన్న బీఎస్పీ పూర్తి సన్నద్ధత, సొంత బలంతో పోరాడుతుందని మాయవతి ప్రకటించారు. ప్రత్యేకించి యూపీలో ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడం వల్ల ప్రతిపక్షాలు చాలా అశాంతికి గురవుతున్నాయని అన్నారు. అయితే బహుజన వర్గాల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ నిర్ణయించిందని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment