Telugu News » Underwater Metro: ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ప్రారంభం.. విద్యార్థులతో ప్రధాని మోడీ ప్రయాణం..!

Underwater Metro: ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో ప్రారంభం.. విద్యార్థులతో ప్రధాని మోడీ ప్రయాణం..!

కోల్‌కతా(Kolkata)లో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌(Underwater Metro Tunnel) ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ మెట్రో దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు కావడం విశేషం.

by Mano
Underwater Metro: First Underwater Metro Starts.. Prime Minister Modi Travels with Students..!

బెంగాల్(Bengal) పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ(PM Modi) పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కోల్‌కతా(Kolkata)లో నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్‌(Underwater Metro Tunnel) ను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ఈ మెట్రో దేశంలో నీటి అడుగున నడిచే తొలి మెట్రో రైలు కావడం విశేషం.

Underwater Metro: First Underwater Metro Starts.. Prime Minister Modi Travels with Students..!

ఈ సందర్భంగా విద్యార్థులు, మెట్రో సిబ్బందితో ప్రధాని మోదీ కాసేపు సంభాషించారు. ఆగ్రా మెట్రో, మీరట్‌ మెట్రో, పుణే మెట్రో సహా దేశవ్యాప్తంగా పలు మెట్రో సేవలను ప్రధాని మోదీ కోల్‌కతా నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. ఇదే వేదికపై కోల్‌కతాలో దాదాపు రూ. 15,400 కోట్ల విలువైన బహుళ కనెక్టవిటీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.

కోల్‌కతా నగరంలో 1984లోనే తొలిసారి మెట్రో సేవలు మొదలైంది. తాజాగా నీటి అడుగున మెట్రో రైలు ప్రారంభంతో మరో సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కతా ఈస్ట్‌- వెస్ట్‌ మెట్రో కారిడార్‌ కింద దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది దిగువన నిర్మించారు. ఈ మెట్రో మార్గం పొడవు మొత్తం 16.6 కిలోమీటర్లు. అయితే 10.8 కి.మీ. భూగర్భంలో ఉంటుంది.

Underwater Metro: First Underwater Metro Starts.. Prime Minister Modi Travels with Students..!

ఈ టన్నెల్ పొడవు 520 మీటర్లు. నదిలోని దూరాన్ని 45 సెకన్లలో దాటే మెట్రోరైలు కోల్‌కతా ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌కు 2009 ఫిబ్రవరిలో పునాది పడింది. అండర్‌ వాటర్‌ మార్గం నిర్మాణాన్ని 2017లో ప్రారంభించారు. ప్రకృతి విపత్తుల్ని సైతం తట్టుకునేలా ఈ కారిడార్‌ను బ్రిటన్‌కు చెందిన పలు ప్రఖ్యాత సంస్థల సహకారంతో నిర్మించారు.

You may also like

Leave a Comment