Telugu News » SP Singh Bhagel : మా పార్టీకి ఒక విధానం ఉంది… షర్మిల వ్యాఖ్యలపై నో కామెంట్స్…!

SP Singh Bhagel : మా పార్టీకి ఒక విధానం ఉంది… షర్మిల వ్యాఖ్యలపై నో కామెంట్స్…!

కొత్త పథకాలను కేంద్రం గ్రామీణ స్థాయిలో తీసుకు వెళ్లోందని వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రిలో కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ పర్యటించారు.

by Ramu
union minister sp singh baghel key comments on central government funds in andhra pradesh rural area

కేంద్ర మంత్రి (Union Minister) ఎస్పీ సింగ్ బాఘేల్ (SP Singh Bhagel) కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామీణ పథకాలకు 80 శాతం నిధులను కేంద్రం, 20 శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. కొత్త పథకాలను కేంద్రం గ్రామీణ స్థాయిలో తీసుకు వెళ్లోందని వెల్లడించారు. ఏపీలోని రాజమండ్రిలో కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఎస్పీ సింగ్ బాఘేల్ పర్యటించారు.

union minister sp singh baghel key comments on central government funds in andhra pradesh rural area

ఈ సందర్బంగా మీడియాతో కేంద్ర మంత్రి బాఘేల్ మాట్లాడుతూ….. కేంద్రం అమలు చేస్తున్న ఆయుష్మన్ పథకం అందరికీ ఉపయోగపడుతుందని వెల్లడించారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు హెల్త్ ఎండ్ వెల్నెస్ సెంటర్స్ కు తాము 60 శాతం నిధులను విడుదల చేస్తున్నామని వివరించారు.

ప్రధాని నరేంద్ర మోడీపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల చేసిన వ్యాఖ్యలపై స్పందించేందుకు నిరాకరించారు. తమ పార్టీకి ఒక విధానం ఉందని చెప్పారు. తమదైన ఐడియాలజీతో బీజేపీ ముందుకు వెళ్తోందని చెప్పారు. అంతకు ముందు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దివంగత సీఎం వైఎస్సార్​ జీవించినంత కాలం బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ, ఈ రోజు ఏపీలో పరిస్థితులను చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. ఇక్కడి పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా ప్రభుత్వం వాళ్ల చేతుల్లో ఉందన్నారు.

You may also like

Leave a Comment