తెలుగు ఇండస్ట్రీలో రామ్ చరణ్- ఉపాసన(Ramcharan- Upasana) దంపతులు మోస్ట్ బ్యూటీఫుల్ కపూల్‌గా పేరు తెచ్చుకున్నారు. ఈ జంటకు టాలీవుడ్లో ఓ స్పెషల్ క్రేజ్ ఉంది. ఉపాసన సినీ ఇండస్ట్రీలో లేనప్పటికీ అపోలో హాస్పిటల్(Apollo Hospitals) చూసుకుంటూ ప్రజల్లో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది.
ఇటీవల ఉపాసన తన తాత, నాన్నమ్మతో, కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్య(Ayodhya) ‘బాలక్ రామ్’ను దర్శించుకునేందుకు వెళ్లింది. అంతేకాకుండా ప్రత్యేక పూజలు చేసి అక్కడ కొంత సమయాన్ని గడిపింది. దీనికి సంబంధించిన వీడియోను మెగా కోడలు ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
ఆ వీడియోకు ‘‘ నా కోరిక తీరింది. ఒక కల నెరవేరింది. నా జీవితంలో మర్చిపోలేని ప్రయాణంలో ఇది ఒకటి. ఓ అధ్బుతమైన అనుభూతినిచ్చింది’’ అంటూ రాసుకొచ్చింది. ఈ వీడియోలో అయోధ్య రామ మందిరాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో కళ్లకు కట్టినట్లు ఉంది. తన కుటుంబసభ్యులతో కలిసి రాముల వారిని దర్శించుకుంది ఉపాసన.
అక్కడ స్ట్రీట్ ఫుడ్, ఆలయ పరిసరాలను చూపిస్తూ ఉపాసన ఆ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా ఉపాసన తన కూతురు క్లీంకారాను చూసుకుంటూనే అపోలో ఆస్పత్రి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఖాళీ సమయాల్లో భర్త, కూతురుతో కలిసి ట్రిప్ వెళ్తూ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.