Telugu News » USA: విషాదం.. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్, హత్య..!

USA: విషాదం.. అమెరికాలో హైదరాబాద్ విద్యార్థి కిడ్నాప్, హత్య..!

హైదరాబాద్ విద్యార్థి(Hyderabad Student) హత్యకు గురైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు.

by Mano
USA: Tragedy.. Kidnapping and murder of Hyderabad student in America..!

అగ్రరాజ్యం అమెరికా(USA)లో భారతీయ విద్యార్థుల హత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా మరో ఘటన విషాదాన్ని మిగిల్చింది. ఇటీవల కిడ్నాప్‌కు గురైన హైదరాబాద్ విద్యార్థి(Hyderabad Student) హత్యకు గురైనట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌లోని నాచారానికి చెందిన అబ్దుల్ మహ్మద్ అరాఫత్(25) అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తున్నాడు. అబ్దుల్ ఐటీ మాస్టర్స్ కోసం 2023 మేలో యూఎస్ వెళ్లాడు.

USA: Tragedy.. Kidnapping and murder of Hyderabad student in America..!

అక్కడ ఈనెల 7వ తేదీ నుంచి అతడు కనిపించడంలేదు. దీంతో అతడి తండ్రి మహ్మద్ సలీమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. అబ్దుల్‌ను కిడ్నాప్ చేశామని, వదిలిపెట్టాలంటే 1200డాలర్లు పంపించాలని డిమాండ్ చేశారు. లేదంటే అబ్దుల్ కిడ్నీలు అమ్మేస్తామని బెదిరించారు. అయితే సదరు వ్యక్తి డబ్బులు ఎలా అందజేయాలనే విషయాన్ని చెప్పలేదు.

దీంతో అమెరికాలో ఉంటున్న అబ్దుల్ బంధువులు క్లీవ్ ల్యాండ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అబ్ధుల్ సమాచారాన్ని కోరుతూ అతడి కుటుంబ సభ్యులు చికాగాలోని ఇండియన్ కౌన్సిల్ కు మార్చి 18వ తేదీన లేఖ రాశారు. అయితే అబ్దుల్ తిరిగి క్షేమంగా వస్తాడని భావించిన కుటుంబ సభ్యులకు విషాదమే మిగిలింది.

హైదరాబాదీ విద్యార్థి మృతి చెందినట్లు న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ ఖాతా ద్వారా ధృవీకరించింది. అతడి ఆచూకీ కనిపెట్టేందుకు అధికారులు సెర్చ్ ఆపరేషన్ ద్వారా తీవ్రంగా యత్నించారని.. కనిపించకుండా పోయిన మూడు వారాల తర్వాత అతని మృతదేహాన్ని స్థానిక పోలీసులు కనుగొన్నారని తెలిపింది. ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, అబ్దుల్ కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటిస్తూ ఎంబసీ ఒక సందేశాన్ని పంపించింది.

You may also like

Leave a Comment