Telugu News » Venkata Ramana Reddy: తీర ప్రాంతంపైనే జగన్ కన్ను: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం

Venkata Ramana Reddy: తీర ప్రాంతంపైనే జగన్ కన్ను: టీడీపీ అధికార ప్రతినిధి ఆనం

మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

by Mano
Venkata Ramana Reddy: Jagan's eye on coastal region: TDP spokesperson Anam

జగన్(Jagan) అధికారంలోకి రాగానే ఆయన కళ్లు తీరప్రాంతంపై పడ్డాయని టీడీపీ(TDP) అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి(Anam Venkata Ramanareddy) ఆరోపించారు. మంగళగిరి(Mangalagiri)లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Venkata Ramana Reddy: Jagan's eye on coastal region: TDP spokesperson Anam

ఏపీకి అతిపెద్ద తీర ప్రాంతం ఉందని తెలిపారు. జగన్‌కు అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ దీనిపైనే కన్ను అని విమర్శించారు. చంద్రబాబు తీర ప్రాంతాన్ని ‘గేట్ వే ఆఫ్ ఇండియా’గా మార్చాలని చంద్రబాబు అనుకుంటే.. జగన్ మాత్రం ‘గేట్ వే ఆఫ్ జగన్’ గా మార్చారని విమర్శించారు. కబ్జా చేయాలనుకుంటే మొదట జగన్‌కు గుర్తొచ్చేది విజయసాయిరెడ్డి అని దుయ్యబట్టారు.

వైసీపీ అక్రమంగా సంపాదించిన డబ్బును వడ్డీతో సహా వసూలు చేస్తామని ఆనం హెచ్చరించారు. విజయసాయిరెడ్డి వియ్యంకుల కంపెనీ అరబిందో సంస్థ జగన్‌కు బినామీగా వ్యవహరిస్తోందని అన్నారు. మంచి లాభాలతో ఉన్న కాకినాడ సీ పోర్టుపై మొదట జగన్ కళ్లుపడ్డాయని, 2019 నుంచి కేఎస్పీఎల్‌పై దాడి మొదలైందని వెల్లడించారు. షేర్లు ఇవ్వాలని బెదిరించినా ఆ సంస్థ ఒప్పుకోలేదని, ఏటా రూ.300 కోట్లు లాభాల్లో ఉన్న కంపెనీ వాటా ఇవ్వబోమని తెగేసి చెప్పిందని గుర్తు చేశారు.

దీంతో ప్రభుత్వానికి రూ.965.65 కోట్లు ఎగ్గొట్టిందని రిపోర్టు తీసుకొచ్చారని తెలిపారు. విజయసాయిరెడ్డి వెళ్లి బెదిరిస్తే డబ్బు కడతామని ఆ సంస్థ చెప్పేసింది. ఇంత బెదిరించినా కేఎస్పీఎల్ లొంగలేదని మళ్లీ ఆడిట్‌కు ఆదేశించారని తెలిపారు. షేర్ హోల్డర్లు, డైరెక్టర్లు, సీఈవోలను జైలుకు పంపిస్తామని బెదిరించారని , టీడీపీ అధికారంలోకి రాగానే అక్రమాలను వెలికితీస్తామని ఆనం వెంకటసాయిరెడ్డి తెలిపారు.

You may also like

Leave a Comment