Telugu News » V Hanumantha Rao : ప్రధాని మోడీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా ?.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

V Hanumantha Rao : ప్రధాని మోడీ పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా ?.. వీహెచ్ సంచలన వ్యాఖ్యలు..

మోడీ సర్కారు కార్పోరేట్ సెక్టార్‌కే లాభం చేస్తోందని ఆరోపించిన వీహెచ్.. కాంగ్రెస్ సంస్థలను స్థాపిస్తే.. బీజేపీ అవన్నీ అమ్ముకోంటుందని విమర్శించారు.. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో లాభపడాలని ఆశించడం బీజేపీకే చెల్లుతోందని విమర్శలు చేశారు..

by Venu

తెలంగాణ (Telangana) కాంగ్రెస్ సీనియర్ నేత, వీ హనుమంతరావు (V Hanumantha Rao) అయోధ్య రాముని దర్శనానికి వెళ్లడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. బీజేపీపై విమర్శలు చేస్తూనే రామ మందిరానికి కాంగ్రెస్‌ వ్యతిరేకం కాదని తెలిపారు.. కాంగ్రెస్‌ రాముడికి వ్యతిరేకమని బీజేపీ దుష్ఫ్రచారం చేస్తోందని మండిపడ్డారు. దేవుడి మీద అందరికీ భక్తి ఉంటుందని కానీ భక్తి చూపించవలసిన సమయం వచ్చినప్పుడు చూపిస్తారని అన్నారు..

బీజేపీ (BJP)కి రాముడి మీద ప్రేమలేదని.. హిందువుల ఓట్ల మీదే వారికి ప్రేమ అంటూ వీహెచ్ విమర్శనాస్త్రాలు సంధించారు. రాముడిని రాజకీయాల్లోకి లాగి ఓట్లు సంపాదించాలని చూస్తోందని విమర్శించారు. ఇక కాంగ్రెస్ (Congress) నేతలకు అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపనకు రావడం ఇష్టం లేదని బీజేపీ ప్రచారం చేయడం సరికాదని అన్నారు.. అందరం అయోధ్య రామాలయానికి (Ayodhya Ram Mandir) వెళ్తామన్నారు.

అయితే ప్రధాని మోడీ (Modi) పిలిచినప్పుడే అయోధ్యకు వెళ్లాలా ?.. అని ప్రశ్నించారు. మాకు వీలైనప్పుడే అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్తామని హనుమంతరావు తెలిపారు.. రైతులకు మద్దతు ధర పెంచాలని అడిగితే ఇప్పటికి ఇవ్వలేదని, నోట్లు రద్దు చేసి.. చిన్న చిన్న వ్యాపారం చేసుకొనే వాళ్ళను రోడ్డున పడేశారని విమర్శించారు. మోడీ 25 కోట్ల మంది పేదలను ధనికులకు చేశానని చెప్పుకోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

మోడీ సర్కారు కార్పోరేట్ సెక్టార్‌కే లాభం చేస్తోందని ఆరోపించిన వీహెచ్.. కాంగ్రెస్ సంస్థలను స్థాపిస్తే.. బీజేపీ అవన్నీ అమ్ముకోంటుందని విమర్శించారు.. మత చిచ్చుపెట్టి ఎన్నికల్లో లాభపడాలని ఆశించడం బీజేపీకే చెల్లుతోందని విమర్శలు చేశారు.. కరోనా సమయంలో ఎందరో హాస్పటల్ సిబ్బంది కాంట్రాక్ట్ పద్దతిలో తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తే నిర్దాక్షిణ్యంగా వారందరినీ రోడ్డున పడేసిన ఘనత మోడీకి దక్కిందని ఎద్దేవా చేశారు..

You may also like

Leave a Comment