Telugu News » Vadhuvu Webseries Review: అవికా గోర్ వధువు వెబ్ సిరీస్ ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

Vadhuvu Webseries Review: అవికా గోర్ వధువు వెబ్ సిరీస్ ఎలా వుంది..? కథ, రివ్యూ అండ్ రేటింగ్…!

by Sravya
Vadhuvu-Review

Vadhuvu Webseries Review : బెంగాలీ వెబ్ సిరీస్ ‘ఇందు’ కి రీమేక్ గా ఇది వచ్చింది. ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 8, 2023 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అవికా గోర్, నందు, అలీ రెజా, రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు దీనిలో నటించారు. శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందించగా పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని ఈ వెబ్ సిరీస్ ని నిర్మించారు.

వెబ్ సిరీస్: వధువు
నటీనటులు: అవికా గోర్, నందు, అలీ రెజా, రూపా లక్ష్మి, మౌనిక, మాధవి ప్రసాద్, శ్రీధర్ రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్ కె మహేశ్
సంగీతం: శ్రీరామ్ మద్దూరి
నిర్మాతలు: శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని
దర్శకత్వం: పోలూరు కృష్ణ
ఓటీటీ వేదిక: డిస్నీ ప్లస్ హాట్ స్టార్
విడుదల తేదీ: డిసెంబర్ 8, 2023

వధువు వెబ్ సిరీస్ కథ మరియు వివరణ:

స్టోరీ చూసేస్తే… ఇందు (అవికా గోర్) కి కాబోయే భర్తను సొంత చెల్లెలు తీసికెళ్ళిపోతుంది. ఇలా చేయడం వలన పెళ్లి ఆగిపోతుంది. అప్పుడు ఆమె కి మళ్ళీ ఆనంద్ (నందు)తో పెళ్లి ఫిక్స్ అవుతుంది. ఆ తరవాత పెళ్లి పత్రికతో ఆమె చెల్లి వస్తుంది. అమ్మాయి ఇంటికి అబ్బాయి ఇంటి నుంచి సారె లోని పనసపండును కోసి జిల్లేడు ఆకు పెట్టి కుట్టడం జరుగుతుంది. ఆనంద్, ఇందుల పెళ్లి జరగకూడదని, ఆపడానికి ఎన్నో విధాలుగా ట్రై చేస్తుంటారు. అది ఎవరు..? ఇందు అత్తారింటిలో అడుగు పెట్టిన తర్వాత హత్యాప్రయత్నం ఎవరు చేసారు..? ఆనంద్ తమ్ముడు ఆర్య (అలీ రేజా) పెళ్లి అలా ఎందుకవుతుంది..?

Also read:

భార్య వైష్ణవి ఎక్కడ ఉంది…? వీటి కోసం ఈ వెబ్ సిరీస్ ని చూడాలి. ఈ సిరీస్ ని బానే చూపించారు. కథ కూడా మొదటి నుండి ఆసక్తికరంగా సాగుతుంది. అలానే స్క్రీన్ ప్లే కూడా బావుంది. కానీ అసలు కథను అసంపూర్తిగా వదిలేసారు. అది ఆడియెన్స్ ని డిసప్పాయింట్ చెయ్యచ్చు. తక్కువ నిడివిలో ఎక్కువ కథను చెప్పాలనే కొన్ని విషయాలని తేలికగా తీసేసారు. అసలు దోషి ఎవరో చెప్పకుండా సిరీస్ ని క్లోజ్ చేయడం మైనస్ అయింది.

రేటింగ్: 2.75/5

 

You may also like

Leave a Comment