వేములవాడ (Vemulawada) టికెట్ ఆశించి భంగపడ్డ బీజేపీ నేత తుల ఉమ(Tula Uma) తాజాగా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ రోజు బీజేపీకి (BJP) రాజీనామా చేసిన తుల ఉమ.. సొంత గూటిలో వాలారు. మంత్రి కేటీఆర్ (Minister KTR) సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన తుల ఉమకు.. కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు ఈటల రాజేందర్ తో (Etala Rajender) కలిసి బీఆర్ఎస్ పార్టీని (BRS Party) వీడిన తుల ఉమ బీజేపీలో చేరారు. వేములవాడ నుంచి టికెట్ ఆశించారు. కానీ ఇక్కడ జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల తుల ఉమకు టికెట్ దక్కలేదు. అదే సమయంలో కొన్ని నెలల క్రితమే కాషాయ కుండువా కప్పుకున్న వికాస్ రావుకు బీజేపీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర ఆవేదనకు లోనైన ఉమ బీజేపీని వీడారు..
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలు అతి దగ్గరలో ఉన్న సమయంలో బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతుండటం కమలాన్ని కొలుకోకుండా చేస్తుందనే టాక్ వినిపిస్తుంది. మరి చూడాలి తెలంగాణలో కమలం వికసిస్తుందో.. లేక వాడిపోతుందో.. అని పార్టీ పరిస్థితి గమనిస్తున్నవారు అనుకుంటున్నారు.