హీరో వెంకటేష్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అలనాటి నటుల్లో హీరో వెంకటేష్ కూడా ఒకరు. మంచి పేరు తెచ్చుకుని పాపులర్ అయ్యారు వెంకటేష్ వివాదాలకు దూరంగా ఉంటుంటారు. తన పని ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్ప ఎందులోనూ ఆయన కలగజేసుకోరు అందుకనే అందరు హీరోల ఫ్యాన్స్ ఆయనని అభిమానిస్తూ ఉంటారు పైగా వెంకటేష్ కి హేటర్స్ కూడా ఎక్కువగా ఉండరు. వెంకటేష్ మీద ట్రోల్స్ కూడా చేయరు ఎంతో ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ తన లైఫ్లో ముందుకు వెళ్లిపోతుంటారు.
ఆయన రెండవ కూతురు వివాహం గురించి వార్తలు బయటకు రాలేదు వెంకటేష్ పేరు ప్రస్తుతం వార్తల్లో వినపడుతోంది. వెంకటేష్ కి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ఉన్నారు పెద్దకూతురు అశ్రుతకి పెళ్లయి నాలుగేళ్లయింది. 2019లో పెళ్లి అయింది జైపూర్ లో ఒక ఘనంగా అశ్విత పెళ్లిని జరిపారు వెంకటేష్. హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక రెడ్డి తో ఆమె పెళ్లి అయింది. ఇక రెండవ కూతురు హయవాహిని వివాహం పై దృష్టిపెట్టారు.
Also read:
రెండవ కూతురు వాహినిని విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడుతో పెళ్లి చేయాలని అనుకున్నారు. నిశ్చితార్థ వేడుకల్ని ఘనంగా జరిపారు. పెళ్లి ఎప్పుడు అనే విషయం ఇంకా తెలియదు ఇండస్ట్రీలోని వారికి కూడా పెద్దగా ఈ విషయం గురించి తెలియదని తెలుస్తోంది కేవలం దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన బంధువులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. అలానే ఈ వేడుకలో మహేష్ బాబు చిరంజీవి కూడా సందడి చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.