Telugu News » బిఆర్ఎస్, కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి.. ఏమన్నారంటే?

బిఆర్ఎస్, కేసీఆర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి.. ఏమన్నారంటే?

బిఆర్ఎస్, కేసీఆర్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వేణుస్వామి!

by Sri Lakshmi

పలువురు సెలెబ్రిటీల లైఫ్ లో జరిగే ఆసక్తికర విషయాలను ముందుగానే జోస్యం చెప్పే వేణు స్వామి గురించి పరిచయం చెయ్యాల్సిన అవసరం లేదు. ఈయన సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు సెలెబ్రిటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చెబుతూ పాపులర్ అయ్యారు. జ్యోతిష్యం ను నమ్మమని కానీ, నమ్మొద్దని కానీ ఏ ఆధ్యాత్మిక వేత్త చెప్పడం లేదు. కేవలం అది ఓ సమూహానికి సంబంధించిందని.. అది దృష్టిలో ఉంచుకుని ఎవరికీ వారు కష్టపడాలని పలువురు ప్రవచనావేత్తలు చెబుతూ వస్తున్నా సంగతి తెలిసిందే. అయినప్పటికి.. ఎవరైనా జ్యోతిష్యం చెబుతూ ఉంటె వారు చెప్పే విషయాలను ముందు వెనుకా చూడకుండా నమ్మేస్తాం.

దీనితో జ్యోతిష్యం చాలా పాపులర్ అవుతోంది. ఇటీవల వేణుస్వామి బిఆర్ఎస్, కేసీఆర్ ల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. గత ఏడాది ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ తిరిగి వేగం పుంజుకునే అవకాశం లేదని అన్నారు. అలాగే.. కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా ముందుకు సాగలేరని అన్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయాల్లోనే సత్తా చూపగలరని.. అయితే.. వారి పార్టీ పేరులో తెలంగాణ కచ్చితంగా ఉండాలని వేణుస్వామి సూచించారు.

పార్టీ పేరు మార్చడం వల్లే కేసీఆర్ జాతకం కారణంగా ఆయన ఎన్నికల్లో ఓడిపోయారని.. ఆయన పార్టీ పేరులో తెలంగాణ కచ్చితంగా ఉండాలని సూచించారు. ఆయన పార్టీ పేరుని తెలంగాణ రాష్ట్ర సమితిగా పేరు మారిస్తే.. తిరిగి పార్టీకి పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ పార్టీ పేరు మార్చుకుంటే 2025 నుంచి కేసీఆర్ గ్రాఫ్ మళ్ళీ పెరిగే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.

You may also like

Leave a Comment