Telugu News » Vikarabad : క్షమించరాని తప్పు చేసిన పోస్ట్ మాన్.. ఇలాంటి వారు అవసరమా..?

Vikarabad : క్షమించరాని తప్పు చేసిన పోస్ట్ మాన్.. ఇలాంటి వారు అవసరమా..?

లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను 2011 నుంచి చెత్త కుప్పలో పడేయడం సంచలనంగా మారింది. వీటన్నింటినీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేస్తున్న విషయం తెలుసుకొన్న గ్రామప్రజలు షాక్ తిన్నారు.

by Venu

పోస్ట్ మాన్ అంటే ప్రజలకు వారధి లాంటి వారు.. అలాంటి పోస్ట్ మాన్ నిర్లక్ష్యం చేస్తే ఎదురైయ్యే పరిస్థితులు ఒక్కో సారి ఊహించడం కష్టం.. ఎందుకంటే వీరితో ఉండే అవసరాలు అలాంటివి.. వాటిని రాస్తే పేజీలు నిండిపోతాయి.. అందుకే పోస్ట్ మాన్ బాధ్యతతో విధులు నిర్వహించాలని అంటారు.. కానీ వికారాబాద్ (Vikarabad) జిల్లా చౌడపూర్ లో దారుణ ఘటన చోటుచేసుకొంది. ఆ వివరాలు చూస్తే..

చౌడపూర్ (Chaudhapur) మండల కేంద్రంలో నరసింహులు అనే పోస్ట్ మాన్ (Postman).. పోస్టాఫీసుల (Post Office)కు వచ్చిన ఆధార్ కార్డు, పాన్ కార్డు, లెటర్లు ఎవరికి ఇవ్వకుండా వాటన్నింటిని కార్యాలయంలోనే పడేశాడు. అలా ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా పదమూడు (13) సంవత్సరాలుగా భయం లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విషయాన్ని స్థానికులు గమనించారు..

లబ్ధిదారులకు వచ్చిన ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఏటీఎంలు, లెటర్లను 2011 నుంచి చెత్త కుప్పలో పడేయడం సంచలనంగా మారింది. వీటన్నింటినీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ లో వేస్తున్న విషయం తెలుసుకొన్న గ్రామప్రజలు షాక్ తిన్నారు. ఇన్ని రోజులు నెలకు జీతం తీసుకొని చేతులు దులుపుకొన్న పోస్ట్ మాన్ చర్యపై మండిపడుతున్నారు.. నిర్లక్ష్యం వహించిన అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

వివిధ అవసరాల నిమిత్తం గంటల తరబడి ఆధార్ సెంటర్లలో నిలుచుని ఆధార్ తీయించుకుంటే.. వాటిని ఇవ్వకుండా చెత్తకుప్పలో పడవేయడమేంటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇన్ని రోజులు అడిగినా రాలేదంటూ మాట దాటేస్తు వచ్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఉండి వచ్చిన జీతంతో జల్సా చేసుకున్నాడు కానీ.. ప్రజల అవసరాలు గుర్తించకుండా బాధ్యత రాహిత్యంగా మసులుకొన్న పోస్ట్ మాన్ కు తగిన బుద్ధి చెప్పాలని అధికారులను కోరుతున్నారు..

You may also like

Leave a Comment