Telugu News » Vyooham: మీరే తేల్చుకోండి.. ‘వ్యూహం’ సినిమాపై హైకోర్టు..!

Vyooham: మీరే తేల్చుకోండి.. ‘వ్యూహం’ సినిమాపై హైకోర్టు..!

వ్యూహం సినిమాపై ఇవాళ(మంగళవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ వివాదంపై ఓ కమిటీని వేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) నిర్ణయించింది.

by Mano
Vyooham: Decide for yourself.. High Court on 'Vyuham' movie..!

వివాదాస్పద దర్శకుడు(Director) రాంగోపాల్ వర్మ (Ramgopal varma) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాను నిలిపివేయాలంటూ ఇటీవల హైకోర్టులో పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కించ పరిచేలా సన్నివేశాలు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

Vyooham: Decide for yourself.. High Court on 'Vyuham' movie..!

దీంతో సినిమా విడుదలను హైకోర్టు నిలిపివేసింది. అయితే, ఈ వివాదంపై ఓ కమిటీని వేయాలని తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఇవాళ(మంగళవారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. అయితే, ఈ చిత్రం విడుదలపై కమిటీ వేస్తూ అందులో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్, ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు సూచించింది.

కోర్టు నిర్ణయాన్ని మధ్యాహ్నం 12 గంటలకు హైకోర్టుకు తెలపాలని ఆదేశించించింది. గతంలో ఇలాంటి అంశంలోనే బాంబే హైకోర్టు ఒక కమిటీ ఏర్పాటు చేసిందని హైకోర్టు ధర్మాసనం గుర్తుచేసింది. కాగా, అలాంటి కమిటీనే ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ కమిటీలోని సభ్యులను ఇరువైపుల న్యాయవాదులు కలిసి ఎంచుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

కమిటీకి వ్యూహం సినిమాను చూపించాక వారు ఇచ్చే రిపోర్టును శుక్రవారంలోపు హైకోర్టుకు సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు వ్యూహం చిత్ర బృందం ఈ సినిమా విడుదల ఆగిపోవడం వల్ల రూ.కోట్లు నష్టం వాటిల్లుతోందని వాదిస్తోంది. ఈ సినిమాకు సంబంధం లేని వ్యక్తులు పిటిషన్ దాఖలు చేశారని చిత్ర యూనిట్ చెబుతోంది.

 

You may also like

Leave a Comment