Telugu News » Thummala Nageswara Rao : స్వార్థం కోసం స్వలాభం కోసం చేసే బ్రతుకు మాకు అవసరం లేదు..!!

Thummala Nageswara Rao : స్వార్థం కోసం స్వలాభం కోసం చేసే బ్రతుకు మాకు అవసరం లేదు..!!

ఈ నియోజకవర్గం కీర్తి ప్రతిష్ట నిలిపి.. నన్ను అక్కున చేర్చుకొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఋణపడి ఉంటానన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి అని తెలిపిన తుమ్మల.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తాను మాత్రం ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడ్డానని గుర్తు చేశారు..

by Venu
Tummala Nageshwarrao: I have never seen such anarchy in my forty years of political life

అధికారంలో ఉన్న పార్టీలో ఎవరైనా ఉండాలని అనుకొంటారు.. కానీ నేను ఉన్న పార్టీ అధికారంలో ఉండాలనుకొంటున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల‌ నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లా, సత్తుపల్లి (Sattupalli)లోని ఓ ప్రైవేట్ పంక్షన్ హల్ లో జరిగిన.. కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు తుమ్మల‌..

Tummala Nageshwarrao: I have never seen such anarchy in my forty years of political life

ఈ సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలకి ధన్య వాదాలు తెలిపారు.. ఈ నియోజకవర్గం కీర్తి ప్రతిష్ట నిలిపి.. నన్ను అక్కున చేర్చుకొన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఋణపడి ఉంటానన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ప్రాధాన్యత గల నియోజకవర్గం సత్తుపల్లి అని తెలిపిన తుమ్మల.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న తాను మాత్రం ఖమ్మం జిల్లా అభివృద్ధికి పాటు పడ్డానని గుర్తు చేశారు.. నేను ఉన్న పార్టీ జెండా ఎగరాలని కోరుకున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

ధైర్యవంతులైన సత్తుపల్లి ప్రజలు.. రాగమయిని గెలిపించి సత్తా చూపించారన్నారు.. ప్రభుత్వ కార్యక్రమాలు ఏం చేపట్టిన సత్తుపల్లిలోనే ముందుగా చేపడతానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మం (Khammam) జిల్లా.. అవినీతి ఆరోపణలతో.. భూ కబ్జాలతో నిండిపోయిందని.. ఇప్పుడు ఆ బాధ లేదని పేర్కొన్నారు.

గత ప్రభుత్వంలా స్వార్థం కోసం స్వలాభం కోసం చేసే బ్రతుకు మాకు అవసరం లేదన్న తుమ్మల.. ఎల్లప్పుడూ ‌మీ కోసం మీ బాగు కోసమే పని చేస్తానని హామీ ఇచ్చారు.. సత్తుపల్లికి ఏం కావాలన్న చేస్తానని అన్నారు.. గోదావరి జలాలు వైశ్య కాంతుల చేరువులోకి వస్తే నా జీవితం ధన్యం అవుతుందని.. దయానంద్ కు శ్రీరాముని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని తెలుపుతూ.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

You may also like

Leave a Comment