ఈ ఏడాది నాలుగో తుపాను భారత్ ముంచెత్తడానికి సిద్ధమైంది. దక్షిణ అండమాన్ సముద్రం(south Andaman Sea) మలక్కా(Malacca) జలసంధిని ఆనుకుని ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారుతోందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ.. క్రమంగా ఆగ్నేయ బంగాళాఖాతం వైపు 48 గంటల్లో తుపానుగా మారుతుందని పేర్కొన్నారు.
ఈ తుపానుకు ‘మిచాంగ్'(Michaung) అని నామకరణం చేయనున్నారు. తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 మధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ‘మిచాంగ్’తో డిసెంబర్ 2 వరకు గంటకు 50-60 కి.మీ నుంచి 70 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
తుపాను ప్రభావంతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 మధ్య దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. అండమాన్ నికోబర్ దీవుల్లో తేలికపాటి వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపారు. మిచాంగ్ తుపాను ధాటికి గంటకు 35 నుంచి 45కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నవంబర్ 29-30 మధ్యకాలంలో జమ్ము కశ్మీర్-లద్దాఖ్-గిల్గిత్-బాల్టిస్తాన్-ముజఫరాబాద్ లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావం తమిళనాడు, కేరళ రాష్ట్రాలపై కూడా ఉండనుంది. నవంబర్ 30న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో ఇలాంటి పరిస్థితులే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడటంతో ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు తీరప్రాంత జిల్లాలను అప్రమత్తం చేసింది.