Telugu News » Weather Update: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక..!

Weather Update: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక..!

ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా చలి గాలులు పెరిగాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28.4 డిగ్రీలు, 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది.

by Mano
Weather Update: Alert to the people of Telangana.. IMD warns to be careful..!

తెలంగాణ(Telangana)లో ఉష్ణోగ్రతలు(Temperature) రోజురోజుకు తగ్గుముఖం పడున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది జిల్లాల్లో చలి ఎక్కువగా నమోదవుతోంది. ఉత్తర భారతం నుంచి తెలంగాణ మీదుగా వీస్తున్న గాలుల కారణంగా చలి గాలులు పెరిగాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్(Hyderabad) వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.

Weather Update: Alert to the people of Telangana.. IMD warns to be careful..!

ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు స్వల్పంగా గాలులు వీస్తున్నాయని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో నేడు, రేపు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని, తెలంగాణలో నేడు, రేపు కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 28.4 డిగ్రీలు, 19 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉంది. గంటకు 4 నుంచి 8 కి.మీ వేగంతో ఉపరితల గాలులు ఆగ్నేయ దిశగా వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 17.6 డిగ్రీలుగా నమోదైంది. గాలి తేమ 84 శాతంగా నమోదైంది. ఉదయం వేళలో పొగమంచు కమ్మేస్తోంది.

తెలంగాణలో చలి ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రం భీమ్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంది.

You may also like

Leave a Comment