ఏమైనా కొన్ని జరిగినప్పుడు దాని వెనుక ఏదో సంకేతం ఉందని మనం తెలుసుకుంటూ ఉంటాము. సాధారణంగా వీధుల్లో కుక్కలు ఎప్పుడూ అరుస్తూ ఏడుస్తూ కనబడుతుంటాయి మన ఇంటి ముందుకి వచ్చి కూడా కుక్కలు ఏడుస్తూ ఉంటాయి. అయితే అలా కుక్కలు ఏడవడం అనేది అపశకునం అని పెద్ద వాళ్ళు చెప్తూ ఉంటారు. కుక్కలు ఏడిస్తే మంచిదా కాదా..? కుక్కలు ఏడిస్తే ఏం జరుగుతుంది ఇటువంటి విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటి ముందు కానీ వీధిలో కానీ కుక్కలు ఏడ్చినట్లయితే వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు చాలామంది.
కుక్క అరవడం చెడు సంకేతం అని అంటారు కుక్క ఏడుపు దేనిని సూచిస్తుంది అనే విషయానికి వచ్చేస్తే… విపత్తు లేదా ఏదైనా సంఘటన జరగడానికి కుక్క సిగ్నల్ ఇస్తుంది అందుకే కుక్క ఏడుస్తుంది. కుక్క ఏడ్చింది అంటే ఏదో విపత్తు రాబోతుందని అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు కూడా ఈ విషయాన్ని చెప్తూ ఉంటారు రాబోయే విపత్తుల్ని కుక్క సూచిస్తుందట. కుక్క ఏడుపు కొన్ని సంకేతాలని కూడా సూచిస్తుంది. ఇంటి బయట లేదంటే తలుపు దగ్గర కుక్క మొరిగితే ఏదో ఒక వ్యాధిని అది సూచిస్తుంది. కుటుంబంలో ఎవరైనా పెద్ద అనారోగ్యంతో బాధపడుతున్నారని కుక్క ఏడుస్తుందట.
Also read:
రాత్రి కుక్క ఏడిస్తే దురదృష్టం కలుగుతుంది. కుక్క ఏడిస్తే ఆర్థిక నష్టం కూడా కలుగుతుంది భవిష్యత్తులో నష్టాలు కూడా కుక్క ఏడిస్తే కలుగుతాయట. ప్రతికూల శక్తి ఉన్నట్లయితే కుక్క వచ్చి ఏడుస్తూ ఉంటుంది. కుక్క దానిని పసిగడుతుంది అందుకే ఏడుస్తుంది అలానే రాహుకేతువులకి కారకుడు కుక్క. రాహు కేతువుల అశుభాన్ని కుక్క సూచిస్తుంది కుక్క కనక ఇంటి బయట ఏడుస్తున్నట్లు అయితే కచ్చితంగా తరిమికొట్టేయడం మంచిది. కుక్క ఏడ్చేటప్పుడు శివుడిని పూజించి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచిది.