మనకి నిత్యం టీవీ లో చాలా సీరియల్స్ కనబడుతూ ఉంటాయి. సీరియల్స్ లో ఎంతో మంది నటులు ఉంటారు. నటులంతా కూడా రకరకాల కాస్ట్యూమ్స్ ని వేసుకుంటూ ఉంటారు. సమయానుసారం కాస్ట్యూమ్స్ ని ధరిస్తూ ఉంటారు. సీరియల్ నటులు కట్టుకున్న చీరలు మళ్ళీ ఏం చేస్తారు..? ఈ సందేహం చాలా మందిలో ఉంటుంది మరి సీరియల్ నటులు కట్టుకున్న దుస్తులు ఏం చేస్తారు అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం. నిజానికి ఒక సీరియల్ ని తీసుకు రావాలంటే ఎంతో డబ్బులు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

Also read:
సీరియల్ షూటింగ్ టైంలో కొంతమంది సొంత చీరలు తెచ్చుకుని వాటిని వేసుకుంటారు కానీ కొంతమందికి ప్రొడక్షన్ వాళ్ళు చీరలు, కాస్ట్యూమ్స్ డిజైన్స్ ఇస్తారు. సంవత్సరాల పాటు సీరియల్స్ కొనసాగుతాయి ఎవరికి తెలియకుండా ఆ చీరల్ని మళ్లీ మళ్లీ మార్చుకుంటూ కట్టుకుంటుంటారు. ఒకసారి కట్టిన చీరని కొంత టైం తీసుకుని మళ్లీ వాడడం జరుగుతుంది ఇలా కొంతకాలం ఆగి మళ్ళీ వాటినే కట్టుకుంటే ఎవరు గుర్తుపట్టలేరు కూడా. సో ఒకసారి వేసుకున్న బట్టలని గ్యాప్ ఇచ్చి మళ్ళీ మళ్ళీ వాడతారు.
