Variant :ఇండియా సహా ఇతర ప్రపంచ దేశాల్లో కరోనా అదుపులోనే ఉన్నప్పటికీ దీని కొత్త వేరియంట్లు పుట్టుకు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఈజీ 5 వేరియంట్ అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల్లో వెలుగులోకి రాగా తాజాగా అమెరికాలో మరో కొత్త వేరియంట్ బయటపడింది. బీఏ 2.86 గాదీన్ని వ్యవహరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, అమెరికాలోని డిసీజ్ కంట్రోల్ సంస్ధ.. తాము ఈ నూతన వేరియంట్ పై అధ్యయనం చేస్తున్నామని పేర్కొన్నాయి. ఈ బీఏ 2.86 సార్స్ కొవ్ -2 కి (కోవిడ్) కి చెందిన ఓమిక్రాన్ వేరియంట్ కి సబ్ వేరియంట్ అని, దీన్ని మొదట 2022 జూన్ లో డెన్మార్క్ లో గుర్తించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
తరువాత అమెరికా, ఇజ్రాయెల్ దేశాల్లో దీన్ని కనుగొన్నారని వివరించింది. ఇతర ఒమిక్రాన్ సబ్ వేరియంట్లలో కనబడని మ్యుటేషన్లు ఇందులో ఉన్నాయని కానీ వీటిపై పూర్తి స్థాయిలో స్టడీ చేయవలసి ఉందని అమెరికన్ నిపుణులు కూడా పేర్కొన్నారు. దీని ప్రభావాన్ని మరింత మదింపు చేయవలసి ఉందని అన్నారు.
వైరస్ లేదా ఇతర వేరియంట్లకు ఇది పోటీగా ఉంటుందా లేక ఇన్ఫెక్షన్ లేదా వ్యాక్సినేషన్ ముందు ఇమ్యూన్ రెస్పాన్స్ నుంచి తప్పించుకునే అడ్వాంటేజ్ ని కలిగి ఉందా అన్న విషయం తేలవలసి ఉందని వారు వ్యాఖ్యానించారు. రాయిటర్స్ వార్తా సంస్ధ అంచనా ప్రకారం ఈ కొత్త వేరియంట్ లో 36 మ్యుటేషన్లు ఉన్నాయి.
దీన్ని సమర్థించిన హోస్టన్ మెథడిస్ట్ లో డయాగ్నస్టిక్ మైక్రోబయాలజీ మెడికల్ డైరెక్టర్ డా. వెస్లీ లాంగ్.. ప్రస్తుతమున్న x బీబీ 1.5 ఒమిక్రాన్ సబ్ వేరియంట్ పై ఇది ప్రభావం చూపుతుందా అన్నది స్టడీ చేయవలసి ఉందన్నారు. కోవిడ్ ను ఎదుర్కోవడంలో బూస్టర్లు ఇప్పటికీ సహాయపడుతున్నాయని ఆయన చెప్పారు. ప్రస్తుతమున్న డామినెంట్ వేరియంట్ల కన్నా ఈ స్ట్రెయిన్ వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువని వైరాలజిస్ట్ జేసే బ్లూమ్ పేర్కొన్నారు/.