Telugu News » KCR : ఓటమిని అంగీకరించారా? కేసీఆర్ రెండుచోట్ల పోటీ ఎందుకు..?

KCR : ఓటమిని అంగీకరించారా? కేసీఆర్ రెండుచోట్ల పోటీ ఎందుకు..?

ఈ సెకెండ్ ఆప్షన్ ఎంచుకోవడం వెనుక ఓటమి భయం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ చేసిన సర్వేల్లో వ్యతిరేక పవనాలు వీచాయని.. అందుకే, నియోజకవర్గ మార్పుపై కేసీఆర్ దృష్టి పెట్టి కామారెడ్డిని ఎంచుకున్నారని అంచనా వేస్తున్నారు.

by admin
opposition criticizing KCR as insecure

– బీఆర్ఎస్ అధినేత అనూహ్య నిర్ణయం
– ఈసారి గజ్వేల్ తోపాటు కామారెడ్డిలో పోటీ
– ప్రతిపక్షాల అంచనాలే నిజమా?
– గజ్వేల్ లో కేసీఆర్ కు ఓటమి తప్పదా?
– అందుకే, సెకెండ్ ఆప్షన్ ఎంచుకున్నారా?
– సేఫ్టీ సీట్ చూసుకుని బరిలోకి దిగుతున్నారా?
– 2012 నుంచి కామారెడ్డిలో గెలుస్తున్న బీఆర్ఎస్
– ఇంతకీ, సర్వేల్లో ఏం తేలింది..?

తెలంగాణ (Telangana) అసెంబ్లీ యుద్ధానికి సమరశంఖం పూరించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR). ఏడు చోట్ల మార్పులతో అభ్యర్థుల లిస్టును ప్రకటించారు. అయితే.. అనూహ్యంగా కేసీఆర్ ఈసారి రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. గజ్వేల్ (Gajwel) తో పాటు కామారెడ్డి (Kamareddy) ని కూడా ఆయన ఎంచుకున్నారు. ఇదే రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్ లో గత రెండు పర్యాయాలు గెలిచారు కేసీఆర్. అయితే.. వచ్చే ఎన్నికల్లో ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది.

Problems of Gruhalakshmi Scheme

గజ్వేల్ ను వదిలి మేడ్చల్ లో పోటీ చేస్తారని కొంతమంది, లేదు.. యాదాద్రి ఆలయం ఉన్న ఆలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తారని మరికొందరు.. ఇవన్నీ కాదు కామారెడ్డి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని.. ఇప్పటికే అనేక సర్వేలు చేశారని వార్తలు వచ్చాయి. చివరకు సీఎం కామారెడ్డినే ఎంచుకున్నారు. అయితే.. ఈ సెకెండ్ ఆప్షన్ ఎంచుకోవడం వెనుక ఓటమి భయం ఉందని అంటున్నారు రాజకీయ పండితులు. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ చేసిన సర్వేల్లో వ్యతిరేక పవనాలు వీచాయని.. అందుకే, నియోజకవర్గ మార్పుపై కేసీఆర్ దృష్టి పెట్టి కామారెడ్డిని ఎంచుకున్నారని అంచనా వేస్తున్నారు.

నిజానికి, ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ముందే చెప్పారు. కే‌సీ‌ఆర్ గనుక వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచే పోటీ చేయాలని ఛాలెంజ్ కూడా చేశారు. ఈసారి ఆ స్థానంలో సీఎం ఓటమి పక్కా అంటూ కుండబద్దలు కొట్టారు. దానికి కొన్ని కారణాలను కూడా చెప్పారు. నియోజకవర్గంలో కే‌సీఆర్ పై జనంలో వ్యతిరేకత ఏర్పడిందని.. అందుకే, అనుకున్న స్థాయిలో మెజారిటీ రాకపోవచ్చనే ఆలోచనతోనే కేసీ‌ఆర్ గజ్వేల్ కాకుండా వేరే నియోజకవర్గంపై దృష్టి పెట్టారని తెలిపారు. ఇప్పుడు రేవంత్ అంచనానే నిజమైంది.

ఈమధ్యే మీడియాతో మాట్లాడిన కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ పోటీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్ ​లో తన ఓటమిని ముందే గ్రహించి తమ దగ్గరకు ​వస్తున్నారని అన్నారు. గజ్వేల్​ లోని గ్రామాలను నీట ముంచి కామారెడ్డిని ముంచడానికి వస్తున్నారని ఎద్దేవ చేశారు. గజ్వేల్ ​లో అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకునే వారు.. ఇప్పుడు భయంతో పారిపోయి వస్తున్నారని విమర్శించారు. అక్కడ చెల్లని రూపాయి కామారెడ్డిలో చెల్లుతుందా అని చురకలంటించారు. కామారెడ్డిలో బీఆర్ఎస్ 2012 నుంచి గెలుస్తోంది. ఆపార్టీ నేత గంప గోవర్ధన్ వరుసగా విజయం సాధిస్తున్నారు. ఈయన గతంలో టీడీపీలో పని చేశారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరి గెలుస్తూ వస్తున్నారు. ఈ స్థానంలో వరుస విజయాలు నమోదైన నేపథ్యంలో కేసీఆర్.. దీన్ని ఎంచుకున్నట్టుగా చెబుతున్నారు.

You may also like

Leave a Comment