Telugu News » KTR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ ఇలా ఎందుకు మారారు..?

KTR : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ ఇలా ఎందుకు మారారు..?

ఓటమికి కారణాలను వెదుక్కునే పనిలో ఉన్న గులాబీ చిన్న బాస్.. వివాదాస్పదంగా కామెంట్స్ చేయడం పార్టీలో విభేదాలకు కారణం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి..

by Venu
ktr

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బీఆర్ఎస్ (BRS).. లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)పై ఫోకస్‌ పెట్టింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు సైతం నిర్వహిస్తోంది. మెజార్టీ స్థానాల్లో గెలిచేందుకు పావులు కదుపుతోంది. బలమైన అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికల బరిలో ఉంచాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఓటమిని మాత్రం జీర్ణించుకోలేక పోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..

ktr

 

ఈ నేపథ్యంలో ఓటమికి కారణాలను వెదుక్కునే పనిలో ఉన్న గులాబీ చిన్న బాస్.. వివాదాస్పదంగా కామెంట్స్ చేయడం పార్టీలో విభేదాలకు కారణం అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. పార్టీ ఓటమికి కారణం ఎమ్మెల్యేలనే భావనలో కేటీఆర్ (KTR) ఉన్నట్టు అనుకొంటున్నారు.. ఈ భావనలో భాగంగా.. జహీరాబాద్ (Zaheerabad) పార్లమెంట్ సన్నాహక సమావేశంలో, సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేదని వ్యాఖ్యానించడం.. ఓటమికి ఎమ్మెల్యేలను బాధ్యులు చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనుకొంటున్నారు.

అదీగాక పార్లమెంట్ ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని కేటీఆర్ పేర్కొనడం వెనుక ఉన్న అర్థాలను వెతికే పనిలో కొందరు నేతలు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్‌ను మారుస్తామని చెప్పడం కావొచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే కేసీఆర్ (KCR).. కేటీఆర్ ని సీఎం పదవిలో కూర్చోబెట్టి.. తాను జాతీయ రాజకీయాలు ఎలాలని అనుకొన్నట్టు వార్తలు వినిపించాయి..

కొంచెం జాగ్రత్తపడి ఈ ఎన్నికల నుంచి పార్టీని గట్టెక్కించి ఉంటే, కేటీఆర్ కల నెరవేరి రెండో సీఎంగా నిలిచిపోయేవారని.. అదికాస్త మిస్ అవ్వడంతో ఆ ప్రెస్టేషన్ బయటికి కనిపించనీయకుండా ఇలా మాట్లాడుతున్నారని కొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ కూడా స్వయంగా కామారెడ్డిలో ఓడిపోయారన్న విషయాన్ని మరచిపోయి కేటీఆర్ ఇలా మాట్లాడటం పార్టీ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది.

కేసీఆర్ పైన వ్యతిరేకత లేదని చెప్పుకునే ప్రయత్నంలో ఓడిపోయిన ఎమ్మెల్యేలనే ఎక్కువగా బద్నాం చేస్తున్నారని నేతలు అనుకొంటున్నట్టు టాక్.. అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేటీఆర్ ఇలా మారడం వల్ల.. పార్టీ భవిష్యత్తు ఆందోళనకరంగా మారే అవకాశాలున్నట్టు అనుకొంటున్నారు..

You may also like

Leave a Comment