ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది పెళ్లి మొదలు అన్నిటికీ కూడా సాంప్రదాయం ప్రకారం మనం పాటిస్తూ ఉంటాము. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని ఏదో ఒక రోజు విడిచి వెళ్లి పోవాల్సిందే. ఎవరి ప్రేమేయం లేకుండా ఎవరి జీవితాన్ని వాళ్ళు వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. జనన మరణ విషయంలో ఎటువంటి ప్రమేయం కూడా ఉండదు మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే దాకా తనకు సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. అలానే చనిపోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయం ప్రకారం పాటిస్తూ ఉంటారు.
అంత్యక్రియలని నిర్వహించేటప్పుడు చనిపోయిన వ్యక్తి చుట్టూ కుండలో నీళ్లు తిప్పుతూ ఉంటారు. ఆ కుండకు రంధ్రాలు ఉంటాయి నీళ్లు పడుతూ ఉంటాయి. చివరికి కుండని పగలగొట్టడం చూస్తూ ఉంటాము. సినిమాల్లో కూడా ఈ పద్ధతిని చూపిస్తూ ఉంటారు. అయితే ఎందుకు నీళ్లు పోసి తర్వాత కుండని పగలగొడతారు..? దానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
Also read:
చనిపోయిన వాళ్ళ ఆత్మ తిరిగి మనకి కనిపించకూడదని ఉద్దేశంతో కొన్ని ఆచారాలని అంత్యక్రియలు అప్పుడు చేస్తారు. కుండ ని మన శరీరంతో భావిస్తారు. అందులో ఉన్న నీళ్లు మన ఆత్మ అని అంటారు. చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని పైగా శరీరం నుండి ఆత్మ బయటికి వెళ్ళినప్పుడు శరీరాన్ని దహనం చేయడం కి సూచనగా ఇలా చేస్తారు. చనిపోయిన తర్వాత ఎలా అయితే మన శరీరం నుండి ఆత్మ బయటకు వెళ్తుందో కుండ నుండి నీళ్లు బయటకు వెళ్తాయి అని అర్థం అందుకే అంత్యక్రియలు అప్పుడు ఇలా చేస్తారు.