Telugu News » ఉరిశిక్ష విధించక జడ్జి పెన్ నిబ్ ని ఎందుకు విరిచేస్తారు…? కారణం ఏంటంటే..?

ఉరిశిక్ష విధించక జడ్జి పెన్ నిబ్ ని ఎందుకు విరిచేస్తారు…? కారణం ఏంటంటే..?

by Sravya

ఎవరైనా ఏదైనా పెద్ద తప్పు చేస్తే కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది. ఉరిశిక్ష ని అంత త్వరగా వెయ్యరు నిందుతుడు క్షమించరాని నేరం చేసి ఆ నేరం రుజువై, ముద్దాయి కూడా తప్పుని అంగీకరిస్తే క్షమించారని నేరాలకి ఉరిశిక్ష విధిస్తారు. అయితే న్యాయమూర్తులు నిందితులకి ఉరిశిక్షణ వేయాల్సి వస్తే తీర్పు చెప్పిన తర్వాత వాళ్ళ తీర్పును రాసిన పెన్ నిబ్ ని విరిచేస్తారు. సినిమాల్లో మీరు దీనిని చూసే ఉంటారు. అయితే ఎందుకు ఇలా చేస్తారు..? భారతీయ న్యాయమూర్తులు బ్రిటిష్ రాజు కాలం నుండి ఎవరైనా దోషకి మరణ శిక్ష విధించిన తర్వాత వారి పెన్నుల నిబ్ ని పగలగొట్టే ఆచారాన్ని అనుసరించడం జరుగుతోంది.

ఇప్పటికీ కూడా ఈ పద్ధతిని పాటిస్తున్నారు. అయితే ఎందుకు ఇలా చేస్తారు. ఈ విషయానికి వస్తే…. అయితే పెన్ను రక్తం రుచి చూసింది కనుక అది మరొక ప్రాణాన్ని తీసుకోకుండా దానిని వేరు చేస్తూ ఉంటారు. ఈ ఉద్దేశంతోనే ఇలా వీళ్ళు చేస్తుంటారు. అలానే న్యాయమూర్తి మరణ శిక్ష విధించిన తర్వాత అతని ఆర్డర్ ని సమీక్షించే లేదా రద్దు చేసే అధికారం అతనికి ఉండదు.

Also read:

కనుక శిక్ష విధించిన తరువాత న్యాయమూర్తి సంతకం చేయబడిన తర్వాత నిబ్ కూడా విరిగిపోతుంది. దోషి హృదయం లేదా మనసులో మార్పు కలిగి ఉంటే న్యాయమూర్తి తీర్పుని రద్దు చేయలేడు అన్న వాస్తవానికి ప్రతీకగా ఇలా చేయడం జరుగుతుంది అలానే కొంతమంది న్యాయమూర్తులు ఈ నిర్ణయం తీసుకున్నాక ఆ అపరాధం నుండి దూరం చేసే మార్గంగా ఇలా చేస్తారని కూడా నమ్ముతూ ఉంటారు. ఇలా ఈ కారణాల వలన ఉరిశిక్ష విధించిన తర్వాత జడ్జి పెన్ నిబ్ ని విరిసిస్తారు. ఇదీ కారణం.

You may also like

Leave a Comment