హీరో ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు తెలుగులో ఏ హీరోకి సాధ్యం కానంత క్రేజ్ ని కూడా సంపాదించేసుకున్నారు. 44 ఏళ్ళు వచ్చేసాయి ప్రభాస్ కి. అయినా కూడా ఇంకా పెళ్లి ఊసే లేదు. పెళ్లి చేసుకోకుండానే సింగిల్ గానే ఉంటున్నారు డార్లింగ్. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఫాన్స్ అయితే విపరీతంగా ఎదురు చూస్తూ ఉంటారు. ప్రభాస్ పెళ్లి గురించి ప్రముఖ ఇంగ్లీష్ వెబ్సైట్ ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ రాసింది.
పెళ్ళికి అడ్డు వస్తున్న సమస్య ఇదేనని చెప్పుకొచ్చింది. ప్రభాస్ అనుష్క చాలా సినిమాలలో నటించారు కూడా. ప్రభాస్ అనుష్క జోడి కూడా బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతుంటారు. పైగా వీళ్ళిద్దరూ పదేళ్ల నుండి కూడా ప్రేమలో ఉన్నారట. ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకోవాలని ఒకరికొకరు మాట కూడా ఇచ్చుకున్నారు. ఒకవేళ కనుక అది కుదరకపోతే జీవితాంతం సింగిల్ గానే వాళ్లిద్దరూ ఉండాలని అనుకున్నారట. జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ కుటుంబ సభ్యులు పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఇవ్వలేదు.
Also read:
ప్రభాస్ తల్లి బాగా జాతకలని నమ్ముతారు ఆమె చెప్పడంతోనే ప్రభాస్ పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే దసరా సందర్భంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వచ్చే దసరా లోపు శుభకార్యం జరుగుతుందని చెప్పారు. మరి ప్రభాస్ అనుష్క పెళ్లి చేసుకుంటారా లేదంటే ప్రభాస్ అనుష్క ఒకరికొకరు చెప్పుకున్న దాని ప్రకారం సింగిల్ గా ఉండిపోతారా అనేది తెలీదు. మరి ఎటువంటి మార్పు ప్రభాస్ లైఫ్ లో జరగబోతుంది అనేది చూడాల్సి ఉంది