Telugu News » ఎందుకు రజాకార్‌ కి భయపడుతున్నారు..? నిషేధం డిమాండ్‌ వెనుక కారణం ఏమిటి అంటే..?

ఎందుకు రజాకార్‌ కి భయపడుతున్నారు..? నిషేధం డిమాండ్‌ వెనుక కారణం ఏమిటి అంటే..?

అసలు రజాకార్లు అంటే ఎవరు ? వాళ్ళకి ఎందుకు భయపడుతున్నారు ?

by Sravya
razakar

హైదరాబాద్‌ సంస్థానంలో రజాకర్లు చేసిన దారుణాలు మీద సినిమా తీశారు. రజాకర్లు చేసిన దారుణాల గురించి టీజర్‌లో కూడా చూపించడం జరిగింది. తెలంగాణ గడ్డపై మారణహోమం ని నిజాం సైన్యం చేసారు. అయితే ఇది 80, 90 ఏళ్లు ఉన్న వారికి కూడా గుర్తుంది ఉంటుంది. దీన్ని తాజాగా తెరకెక్కించారు. ఇక ఈ మూవీ కి సంబంధించి టీజర్‌ ని గత నెలలో రిలీజ్‌ చేయడం జరిగింది. హైదరాబాద్‌ సంస్థానంలో రజాకర్లు చేసిన దారుణాల గురించి కళ్ళ కి కట్టినట్టు చూపించారు. ఈ టీజర్‌ మీద నెటిజన్లు, రాజకీయ పార్టీలు, మత పెద్దలు మాత్రం తీవ్ర అభ్యంతరం ని తెలుపుతున్నారు. 

Also read:

మంత్రి కేటీఆర్‌ కూడా ఈ విషయం పై స్పందించారు. తెలంగాణలో పాలిటిక్స్‌లో రజాకార్‌ టీజర్‌ ప్రస్తుతం సంచలనాన్ని రేపుతోంది. రజాకార్‌ మూవీని తెలంగాణ ప్రభుత్వం బ్యాన్‌ చేయమని అంటోంది. ఇక ఈ సినిమా కథ ఏమిటి అనే విషయానికి వస్తే.. యాటా సత్యనారాయణ ఈ మూవీ ని తెర మీదకి తీసుకు రావడం జరిగింది. బీజీపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఈ సినిమా ని నిర్మిస్తున్నారు.

తెలంగాణలో ఎలెక్షన్స్‌ దగ్గర పడుతున్నాయి. దీనితో ఇది కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిందని అంతా అంటున్నారు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వచ్చింది కానీ హైదరాబాద్‌కు మాత్రం రాలేదంటూ ఈ టీజర్‌ ని స్టార్ట్ చేశారు. హైదరాబాద్‌ సంస్థానంలో రజాకర్లు హిందువులను ఇస్లాంలోకి మార్పించి.. ముస్లిం రాజ్యంగా చేయాలనే ఉద్దేశంతో జరిగిన దారుణాలను, అరాచకాలను ఈ మూవీ లో చూపించారు. రజాకార్ల పేరుతో ముస్లింలనే లక్ష్యంగా చేస్తూ చెడ్డగా చూపించేందుకు ప్రయత్నం చేసారంటున్నారు.  స్వార్థ రాజకీయా ప్రయోజనాల కోసం తెలంగాణలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చేస్తున్నారు అని చెప్పారు కేటీఆర్‌.

You may also like

Leave a Comment