Telugu News » రైల్వే ట్రాక్ పై W/L అని.. ఎందుకు ఉంటుంది..? దీనికి కారణం తెలుసా..?

రైల్వే ట్రాక్ పై W/L అని.. ఎందుకు ఉంటుంది..? దీనికి కారణం తెలుసా..?

by Sravya

చాలామంది ఎక్కువగా రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ట్రైన్లో జర్నీ చేయడానికి ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. రైల్వేస్ కి సంబంధించి చాలా విషయాలు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి కానీ చాలామందికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. నిజానికి దేనిలోనైనా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు. కొత్త విషయాలు తెలిసిన తర్వాత ఓహో దానికి కారణం ఇదా అని ఆశ్చర్యపోతుంటారు. రైల్వేస్ లో కూడా తెలుసుకోవడానికి ఎన్నో విషయాలు ఉన్నాయి ట్రైన్ లో వెళ్తున్నప్పుడు పట్టాల పక్కన చూసినట్లయితే బోర్డులు కనపడుతూ ఉంటాయి కిటికీ నుండి బయటకి చూస్తే బోర్డులు మనకు ఈజీగా కనబడుతూ ఉంటాయి.

indian raiways cacelled nearly 300 trains in nothern railways

ఈ బోర్డు మీద కొన్ని సింబల్స్ కూడా ఉంటాయి ఈరోజు బోర్డుల గురించి ఆసక్తికరమైన విషయాలను చూసేద్దాము.  W/L బోర్డు రైల్వే ట్రాక్ కి రెండు పక్కల కూడా ఉంటుంది ట్రాకుల మీద ఈ బోర్డులని (W/L boards) ఎందుకు పెడతారు అనేది చూస్తే… రైలు నడిపే లోకో పైలట్ లు అప్రమత్తంగా ఉండాలని, జాగ్రత్తగా రైలు నడపాలని బోర్డులు సూచిస్తాయి. రైల్వే శాఖ క్రాసింగ్ కి రెండు పక్కల కూడా ఈ బోర్డులుని పెట్టడం జరుగుతుంది. దీన్ని దాటడానికి 600 మీటర్ల ముందే బోర్డు ఉంటుంది.

Also read:

దీని మీద నుండి లోకోపైలట్ వెళ్తున్నప్పుడు హారన్ కొట్టాలి ఆ బోర్డు దాటేదాకా హారన్ కొట్టాల్సి ఉంటుంది క్రాసింగ్ వద్ద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటివి జరగకుండా ఉండడానికి హారన్ ఇవ్వాలి. పసుపు రంగు బోర్డుని ఎందుకు వాడతారు అంటే క్లియర్ గా పసుపురంగు మనకి కనబడుతుంది. దూరం నుండి కూడా పసుపు రంగును గుర్తించొచ్చు. క్లియర్ గా ఉంటుంది. నేల నుండి బోర్డు 2100 మిల్లీ మీటర్ల ఎత్తులో ఉంటుంది.

You may also like

Leave a Comment