Telugu News » అంత్యక్రియల్లో చితికి నిప్పంటించిన వ్యక్తి ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు..? కారణం ఏమిటంటే..?

అంత్యక్రియల్లో చితికి నిప్పంటించిన వ్యక్తి ఎందుకు వెనక్కి తిరిగి చూడకూడదు..? కారణం ఏమిటంటే..?

by Sravya

చనిపోయిన తర్వాత అంతేక్రియలుని నిర్వహిస్తారు. అంత్యక్రియలు నిర్వహించడానికి ఒక పద్ధతి ఉంటుంది. పద్ధతి ప్రకారం పాటిస్తూ ఉంటారు. మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. పుట్టినప్పటి నుండి మరణించేవరకు కూడా అనేక పద్ధతుల్ని మనం పాటిస్తూ ఉంటాము చనిపోయినప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది. చనిపోయిన తర్వాత పలు కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాంప్రదాయ ఆచారాల్లో చావు తంతు కూడా ఉంది. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తిని ఊరేగింపుగా తీసుకువెళ్లి చితిపై పడుకోబెట్టి తర్వాత తల కొరివి పెట్టడం, చిటికె నిప్పంటించాక వెనక్కి చూడకుండా వచ్చేయడం. ఇలా పలు పద్ధతులు ఉన్నాయి.

అయితే ఇది అందరికీ ఒకేలా ఉండాలని రూల్ లేదు. అంత్యక్రియలు సంస్కృతి సంప్రదాయాలు ఒక్కో చోట ఒక్కో తీరు కలిగి ఉంటాయి ఈ సంప్రదాయాన్ని పాటిస్తే చనిపోయిన వ్యక్తి ఆత్మ శాంతిస్తుందని అంటారు పెద్దలు. చనిపోయిన వ్యక్తిని చితి మీద పడుకోబెట్టి ఆ తర్వాత తలకొరివి పెట్టే వ్యక్తి కుండతో చుట్టూ తిరుగుతాడు తర్వాత చితి నుంచి ముందుకు వెళ్తాడు. మళ్ళీ వెనకకు అసలు చూడరు. గరుడ పురాణం ప్రకారం అంత్యక్రియలు నుండి తిరిగి వస్తున్నప్పుడు పొరపాటున కూడా వెనక్కి చూడకూడదట.

Also read:

అలా చూసినట్లయితే మరణించిన వ్యక్తి ఆత్మ ని చూసే వారితో ప్రేమలో పడిపోతుంది ఆ వ్యక్తి మాత్రమే అతని కోసం విచారంగా ఉన్నాడని భావిస్తుంది అందువలన ఆత్మ శాంతిని పొందదు. ఆ వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకుంటుంది అందుకని అలా చేయకూడదని పెద్దలు చెప్తారు ఆ వ్యక్తి ఇంట్లోకి మళ్లీ ఆత్మ రావాలని కోరుకుంటుంది. అందుకని వెనక్కి అస్సలు చూడకూడదు అలానే కుండకి రంధ్రం పెట్టి కుండని చితి చుట్టూ తిప్పడం ఇలా ఎన్నో ఆచారాలు ఉన్నాయి పూర్వకాలం నుండి కూడా ఈ ఆచారాలని మనం పాటిస్తున్నాము మన ఆచారాలను సంప్రదాయాలని భావితరాలకు కూడా మనం అందించాలి.

You may also like

Leave a Comment