Telugu News » World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. జట్టు నుంచి ఆల్‌రౌండర్ ఔట్..!

World Cup: టీమిండియాకు బిగ్ షాక్.. జట్టు నుంచి ఆల్‌రౌండర్ ఔట్..!

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik pandya) ప్రపంచకప్‌ 2023 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయంతో జట్టుకు పూర్తిగా దూరమైనట్లు ఐసీసీ తెలిపింది.

by Mano
World Cup: Big shock for Team India.. All-rounder out of the team..!

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌(World Cup)లో వరుస విజయాలతో దూసుకెళుతున్న టీమిండియా (Team India)కు భారీ షాక్ తగిలింది. గాయంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(Hardik pandya) ప్రపంచకప్‌ 2023 టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. చీలమండ గాయంతో జట్టుకు పూర్తిగా దూరమైనట్లు ఐసీసీ తెలిపింది. హార్దిక్‌ స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణను జట్టులోకి తీసుకున్నారు.

World Cup: Big shock for Team India.. All-rounder out of the team..!

పూణె వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. గాయంతో హార్దిక్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ విజయాన్ని కైవసం చేసుకున్నప్పటికీ అప్పటి నుంచి హార్దిక్ ఆటకు దూరమయ్యాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్ సందర్భంగా 9వ ఓవర్‌లో బంగ్లాదేశ్ బ్యాటర్ లిటన్ దాస్ కొట్టిన స్ట్రయిట్ డ్రైవ్‌ను ఆపే ప్రయత్నంలో హార్దిక్ గాయపడ్డాడు. కాలు బెనకడంతో మైదానాన్ని వీడాడు.

సెమీసు ముందు ఇది టీమిండియాకు పెద్ద దెబ్బ అనే చెప్పాలి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమిలో హార్దిక్ ఉన్నాడు. హార్దిక్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కూడా నిష్ణాతుడు. ఆల్‌రౌండర్‌గా సేవలందిస్తున్న పాండ్యా చెన్నెలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. ఇక నాలుగు మ్యాచ్ బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు.

హార్దిక్ స్థానంలో వస్తున్న ప్రసిధ్ కృష్ణ ఇప్పటివరకు 17 వన్డేలు మాత్రమే ఆడాడు. ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాపై తొమ్మిది ఓవర్లలో 45 రన్స్ ఇచ్చి డేవిడ్ వార్నర్ వికెట్లు పడగొట్టాడు. జస్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఫామ్ దృష్ట్యా కృష్ణకు చోటు దక్కడం కష్టమే.

You may also like

Leave a Comment